Breaking News

‘ఆర్‌బీఐ రేట్ల కోత మ్యాజిక్‌ బుల్లెట్‌ కాదు’

Published on Wed, 07/23/2025 - 14:42

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు పెట్టుబడులను ఇతోధికం చేసే మ్యాజిక్‌ బుల్లెట్‌ కాబోదని మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుత తరుణంలో వడ్డీ రేట్లు అధికంగా లేవన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్‌బీఐ రేట్ల కోత ఫలితమిచ్చేందుకు సమయం పడుతుందన్నారు.

ఆర్‌బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం మేర రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ఈ రేట్ల తగ్గింపు అంతిమంగా కంపెనీల పెట్టుబడులు పెరిగేందుకు దారితీస్తుందా? అంటూ ఓ మీడియా సంస్థ ఆయన్ను ప్రశ్నించింది. ‘కేవలం వడ్డీ రేట్లతోనే ఇది సాధ్యపడుతుందని నేను అనుకోవడం లేదు. ఒకటికి మించిన అంశాలు ఇందులో పనిచేస్తాయి. మరిన్ని రంగాల్లో పోటీని పెంచాలి. తమ సానుకూలతలను కాపాడుకునేందుకు వీలుగా పెట్టుబడులపై మరింతగా దృష్టి పెట్టే విధంగా పరిశ్రమలను ప్రోత్సహించాలి. మరిన్ని కార్పొరేట్‌ పెట్టుబడులు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను’అని రాజన్‌ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులు 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ గణంకాల ఆధారంగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: చందా కొచ్చర్‌పై ఆరోపణలు.. నిజం బట్టబయలు

ప్రతి ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం జూన్‌ నెలలో 2.1 శాతానికి దిగిరావడంతో ఆర్‌బీఐ మరిన్ని రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రాజన్‌ నేరుగా బదులివ్వలేదు. ద్రవ్యోల్బణం పరంగా భారత్‌ సౌకర్యమైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పారిశ్రామిక దేశాలపై అమెరికా టారిఫ్‌ల విధింపు.. అంతిమంగా ఆయా దేశాల్లోకి అమెరికా ఉత్పత్తుల ప్రవేశం ప్రతి ద్రవ్యోల్బణానికి (ధరల పతనానికి) దారితీస్తుందన్నారు. ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్న రిటైల్‌ ద్రవ్యోల్బణం కంటే ప్రధాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నట్టు గుర్తు చేశారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)