Breaking News

ఈ–కామర్స్‌కు పోటీగా క్విక్‌ కామర్స్‌

Published on Thu, 01/02/2025 - 06:22

న్యూఢిల్లీ: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంప్రదాయ ఈ–కామర్స్‌ దిగ్గజాలకు  క్విక్‌ కామర్స్‌ పోటీనిస్తుందని జెప్టో కో–ఫౌండర్, సీఈవో ఆదిత్‌ పాలీచా అన్నారు. భారత్‌లో అమెజాన్‌/ఫ్లిప్‌కార్ట్‌ స్థాయి ఫలితాన్ని సృష్టించగల సామర్థ్యాన్ని క్విక్‌ కామర్స్‌ కలిగి ఉందని 2024లో ప్రజలు గ్రహిస్తారని జెప్టో గతేడాది ప్రకటించిందని నూతన సంవత్సరం సందర్భంగా లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో  ఆయన గుర్తు చేశారు. 2025లో క్విక్‌ కామర్స్‌  కూడా ఈ–కామర్స్‌తో పోల్చదగిన స్థాయిని చేరుకుంటుందని తెలిపారు. ఐపీవో బాటలో ఉన్న జెప్టో 2023–24లో నిర్వహణ ఆదాయం 120 శాతం పెరిగి రూ.4,454 కోట్లకు చేరుకుంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జోమాటో బ్లింకిట్‌ వంటి పోటీ కంపెనీలను అధిగమించింది. 

ప్రతి కంపెనీకి సవాలు.. 
కార్యకలాపాలను అసాధారణంగా అమలు చేయడంపై క్విక్‌ కామర్స్‌ విజయం ఆధారపడి ఉంటుందని ఆదిత్‌  నొక్కిచెప్పారు. ఆ స్థాయిలో అమలు చేయడం ప్రతి కంపెనీకి ఒక సవాలుగా ఉంటుందని అన్నారు. ‘2025లో క్విక్‌ కామర్స్‌ యొక్క ప్రాథమిక అంశాలు నాటకీయంగా అభివృద్ధి చెందుతాయి. కస్టమర్‌ చేసే చెల్లింపులకు తగ్గ విలువ మరింత వేగంగా పెరుగుతుంది. నిర్వహణ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆర్థికాంశాలు, కార్యక్రమాలు మారతాయి. 2023, 2024తో పోలిస్తే ఈ పరిశ్రమకు క్యాపిటల్‌ మార్కెట్‌ వాతావరణం కూడా భిన్నంగా కనిపిస్తుంది’ అని అన్నారు. నమ్మశక్యం కాని రీతిలో 2025 ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో వేదికగా నూతన సంవత్సర అమ్మకాల్లో 200 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు.  

రికార్డుల న్యూ ఇయర్‌.. 
డిసెంబర్‌ 31న అత్యధిక విక్రయాలను సాధించామని బ్లింకిట్‌ ప్రకటించింది. ఒక నిమిషంలో, ఒక గంటలో అత్యధిక ఆర్డర్లతోపాటు.. ఒక రోజులో డెలివరీ భాగస్వాములు అందుకున్న టిప్స్‌ సైతం అత్యధికమని బ్లింకిట్‌ సీఈవో అల్బిందర్‌ ధిండ్సా మైక్రో–బ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. అర్ధరాత్రి 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయాన్ని భారతీయులు స్వీకరించినందున నూతన సంవత్సర వేడుక రోజున ఒక రోజులో అత్యధికంగా ద్రాక్షలను విక్రయించినట్లు బ్లింకిట్‌ పేర్కొంది. స్పానిష్‌ సంస్కృతిలో పాతుకుపోయిన ఈ ట్రెండ్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ టాపిక్‌గా మారిందని వివరించింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)