Breaking News

మెట్రోల్లోనే క్విక్‌ కామర్స్‌ జోరు..

Published on Sat, 07/05/2025 - 09:49

క్విక్‌కామర్స్‌ రంగం శరవేగంగా వృద్ధి సాధిస్తున్నప్పటికీ.. మెట్రోలకు వెలుపల పట్టణాల్లో లాభదాయకమైన విస్తరణ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని మార్కెట్‌ పరిశోధనా సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. క్విక్‌కామర్స్‌ సంస్థల స్థూల వస్తు విక్రయ విలువ (జీఎంవీ)లో నాన్‌ మెట్రోలు 20 శాతం వాటానే భర్తీ చేస్తున్నట్టు పేర్కొంది. తక్కువ డిమాండ్, డిజిటల్‌ పరిణతి తక్కువగా ఉండడం, స్థానిక షాపింగ్‌ అలవాట్లను రెడ్‌సీర్‌ నివేదిక ప్రస్తావించింది.

2025 మొదటి ఐదు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు క్విక్‌ కామర్స్‌ సంస్థల ఆదాయం 150 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. డార్క్‌ స్టోర్లను పెద్ద ఎత్తున ప్రారంభించడం, వివిధ విభాగాల్లోకి దూకుడుగా ఎంట్రీ ఇవ్వడం, తీవ్రమైన పోటీ ఈ వృద్ధికి నేపథ్యాలుగా వివరించింది. టాప్‌–10–15 పట్టణాల వెలుపల ఒక్కో డార్క్‌స్టోర్‌కు వచ్చే రోజువారీ ఆర్డర్ల తగ్గుదల వేగంగా ఉందని వెల్లడించింది. 1,000 దిగువకు ఆర్డర్లు తగ్గాయని.. టాప్‌15కు తదుపరి టాప్‌ 20 పట్టణాల్లో డార్క్‌ స్టోర్‌ వారీ ఆర్డర్లు 700 దిగువకు తగ్గినట్టు తెలిపింది.

ఇది డిమాండ్‌ బలహీనతను తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఆన్‌లైన్‌ సంస్థల పట్ల నమ్మకం తక్కువగా ఉండడం, డిజిటల్‌ టెక్నాలజీల పట్ల అవగాహన తక్కువగా ఉండడం ఆర్డర్లు పరిమితంగా ఉండడానికి కారణంగా పేర్కొంది. జనాభా కూడా తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. క్విక్‌కామర్స్‌ సంస్థలు ఆఫర్‌ చేసే వస్తు శ్రేణి స్థానికుల అభిరుచులకు అనుగుణంగా ఉండకపోవడాన్ని పేర్కొంది.

దీనికితోడు ఈ ప్రాంతాల్లో స్థానిక రిటైల్‌ స్టోర్లకు, ప్రజలకు మధ్య ఉండే బలమైన సంబంధాలను ప్రస్తావించింది. దీంతో మెట్రోలతో పోల్చితే నాన్‌ మెట్రోల్లో ఒక్కో డార్క్‌స్టోర్‌ లాభం–నష్టాల్లేని స్థితి రావడానికి రెట్టింపు సమయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)