Breaking News

క్విక్‌ రెస్టారెంట్లకు ధరల సెగ 

Published on Thu, 06/12/2025 - 04:54

న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం దెబ్బతో క్విక్‌ సర్వీస్‌ రెస్టారెంట్లు (క్యూఎస్‌ఆర్‌) మార్జిన్లపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నాయి. డిమాండ్‌ మందగించడంతో ముడి సరుకుల ఖర్చులు పెరిగినప్పటికీ క్యూఎస్‌ఆర్‌ కంపెనీలు రేట్లను పెంచాలంటే వెనుకాడుతున్నాయి. స్టోర్ల విస్తరణ విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, అదే సమయంలో ఫుడ్‌ డెలివరీ సంస్థల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. బీఎన్‌పీ పారిబా రూపొందించిన ఓ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 
 
డిస్కౌంట్లను నిర్దిష్ట కస్టమర్లకు మాత్రమే పరిమితం చేస్తున్నప్పటికీ సగటు రోజువారీ అమ్మకాలు తగ్గడంతో క్యూఎస్‌ఆర్‌ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. స్టోర్లను ఎడాపెడా వేగంగా విస్తరించడం, నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం తదితర అంశాల వల్ల స్థూల మార్జిన్లపై ప్రభావం పడుతోందని వివరించింది. ఇక, ఫుడ్‌ డెలివరీ సంస్థల విషయానికొస్తే స్విగ్గీ, జొమాటోలాంటి అగ్రిగేటర్ల మార్జిన్లు మాత్రం మెరుగ్గా ఉంటున్నాయి. 

భారీ స్థాయిలో ఎదిగిన ఈ రెండు సంస్థలు.. క్యూఎస్‌ఆర్‌ చెయిన్ల కన్నా చిన్నవైన రెస్టారెంట్లను కస్టమర్లకు మరింత చేరువ చేశాయి. దీంతో లిస్టెడ్‌ క్యూఎస్‌ఆర్‌ కంపెనీలకు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇది సరిపోదన్నట్లు ఆన్‌లైన్‌ ఫుడ్‌ అగ్రిగేటర్లు తమ సొంత డార్క్‌ కిచెన్‌ బ్రాండ్లను (బిస్ట్రో, స్నాక్‌ మొదలైనవి) ప్రారంభించి, ప్రత్యేక యాప్‌ల ద్వారా 10–15 నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ సేవలు అందిస్తున్నాయి. ఈ పరిణామాలతో గత నాలుగేళ్లుగా చూస్తే ఫుడ్‌ డెలివరీ సంస్థల మార్జిన్లు పెరుగుతుండగా, క్యూఎస్‌ఆర్‌ల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందని నివేదిక వివరించింది.  

సామర్థ్యాలు పెంచుకోవాలి..  
జూబిలెంట్‌ ఫుడ్స్‌లాంటి క్యూఎస్‌ఆర్‌ కంపెనీలు ముడి సరుకుల ధరలపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, డిమాండ్‌ బలహీనంగా ఉండటంతో ధరలను పెంచేందుకు ఇష్టపడటం లేదు. నివేదిక ప్రకారం.. ఫుడ్‌ డెలివరీ సంస్థలతో పోలిస్తే క్యూఎస్‌ఆర్‌ చెయిన్ల అమ్మకాలు తక్కువ స్థాయిలోనే ఉంటున్నాయి. లిస్టెడ్‌ క్యూఎస్‌ఆర్‌ చెయిన్ల మొత్తం అమ్మకాలు 2024 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం పెరగ్గా, 2025 ఆర్థిక సంవత్సరంలో 10 శాతానికి పరిమితమయ్యాయి. 

అదే ఫుడ్‌ డెలివరీ సంస్థల స్థూల ఆర్డర్ల విలువ (జీవోవీ) 2024 ఆర్థిక సంవత్సరంలో 19 శాతంగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంగా నమోదైంది. దేశీ క్యూఎస్‌ఆర్‌ మార్కెట్లో పోటీపడాలంటే ప్రస్తుత సంస్థలు తమ మార్కెట్‌ వాటాను కాపాడుకోవాలంటే వినూత్నమైన విధంగా వేగం, మెనూ, డెలివరీ సామరŠాధ్యలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఆదాయ పన్ను రేట్ల సవరణలు, ఇతరత్రా సానుకూల పరిణామాలతో డిమాండ్‌ మళ్లీ పుంజుకోగలదని క్యూఎస్‌ఆర్‌ సంస్థలు ఆశిస్తున్నాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)