Breaking News

ఖతార్ ఎయిర్‌వేస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా స్టార్‌ హీరోయిన్‌

Published on Thu, 03/02/2023 - 16:35

న్యూఢిల్లీ: దుబాయ్‌కి చెందిన ఖతార్ ఎయిర్‌వేస్ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెను తమ గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించింది.  ఈ సందర్బంగా ఖతార్‌కు మించింది మరేదీ లేదు అంటూ కొత్త క్యాంపెయిన్‌ ప్రారంభించింది. దీనికి సంబంధించి ఖతార్‌ ఎయిర్‌వెస్‌ 'ఆంట్‌ నో బడీ' ప్రచార వీడియోను ట్వీట్‌ చేసింది. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయం హమద్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో బ్యూటిఫుల్‌  లుక్‌లో దీపికా పడుకొణె మెరిసింది. 

ప్రీమియం అనుభవంతో, ఎక్సలెన్స్‌కు, లగ్జరీకి పర్యాయపదంగా ఉన్న ఖతార్‌కు దీపిక గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణమని, ఇందుకు ప్రఖ్యాత నటి దీపికా సరియైన  ఎంపిక అంటూ ఖతార్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, హిస్ ఎక్సలెన్సీ అక్బర్ అల్ బేకర్ సంతోషాన్ని ప్రకటించారు. 

ఖతార్ ఎయిర్‌వేస్ ఇటీవలే  ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ రేటింగ్ ఆర్గనైజేషన్ స్కైట్రాక్స్ అందించే 2022 వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో 'ఎయిర్‌లైన్ ఆఫ్ ది ఇయర్'గా అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకోవడం వరుసగా ఇది ఏడోసారి (2011, 2012, 2015, 2017, 2019, 2021 2022). వీటితో పాటు వరల్డ్ బెస్ట్‌ బిజినెస్‌ క్లాస్‌, వరల్డ్ బిజినెస్‌ క్లాస్‌ లాంజ్ డైనింగ్, బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ అవార్డులను కూడా అందుకుంది. కాగా ఖతార్ఎయిర్‌వేస్ దోహా హబ్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ ద్వారా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 150 కంటే  ప్రదేశాలకు విమానాల్ని నడుపుతోంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)