Breaking News

ఎగిసిన స్టాక్‌ ఎక్స్ఛేంజీల లాభాలు

Published on Wed, 05/07/2025 - 20:04

స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 7 శాతం పుంజుకుని రూ. 2,650 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 13 శాతం క్షీణించి రూ. 4,397 కోట్లకు పరిమితమైంది.

అంతక్రితం క్యూ4లో రూ. 5,080 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 35 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. దీనిలో రూ. 11.46 ప్రత్యేక డివిడెండ్‌ కలసి ఉంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎన్‌ఎస్‌ఈ నికర లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 12,188 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 19,177 కోట్లకు బలపడింది. ఈ కాలంలో మొత్తం రూ. 59,798 కోట్లమేర సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్‌టీటీ) చెల్లించింది.  

బీఎస్‌ఈ లాభం హైజంప్‌
మరో స్టాక్‌ ఎక్స్ఛేంజీ దిగ్గజం బీఎస్‌ఈ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం హైజంప్‌ చేసి రూ. 494 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 107 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 543 కోట్ల నుంచి రూ. 926 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ. 23 డివిడెండ్‌ ప్రకటించింది. దీనిలో రూ. 5 ప్రత్యేక డివిడెండ్‌ కలసి ఉంది.

కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బీఎస్‌ఈ నికర లాభం 3 రెట్లు దూసుకెళ్లి రూ. 1,322 కోట్లను తాకింది. 2023–24లో కేవలం రూ. 404 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,596 కోట్ల నుంచి రూ. 3,236 కోట్లకు బలపడింది. ఈ కాలంలో ఈక్విటీ డెరివేటివ్స్‌లో 30.5 బిలియన్‌ కాంట్రాక్టులు ట్రేడ్‌కాగా.. రూ. 1,415 కోట్ల ఆదాయం నమోదైనట్లు బీఎస్‌ఈ వెల్లడించింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)