Breaking News

స్విగ్గీ నష్టాలు పెరిగాయ్‌.. మొబిక్విక్‌ లాభాలు పోయాయ్‌..

Published on Thu, 02/06/2025 - 10:45

ఫుడ్, గ్రోసరీ డెలివరీల ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ (Swiggy) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర నష్టం భారీగా పెరిగి రూ. 799 కోట్లను దాటింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 574 కోట్ల నష్టం నమోదైంది.

కాగా.. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,049 కోట్ల నుంచి రూ. 3,993 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 3,700 కోట్ల నుంచి రూ. 4,898 కోట్లకు పెరిగాయి. స్థూల ఆర్డర్ల విలువ(జీవోవీ) 38 శాతం బలపడి రూ. 12,165 కోట్లను తాకింది. క్విక్‌ కామర్స్‌ బిజినెస్‌ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ జీవోవీ 88 శాతం జంప్‌చేసి రూ. 3,907 కోట్లకు చేరింది. కొత్తగా 96 స్టోర్లను జత కలుపుకోవడంతో యాక్టివ్‌ డార్క్‌ స్టోర్ల విస్తీర్ణం 2.445 మిలియన్‌ చదరపు అడుగులకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.  

నష్టాల్లోకి మొబిక్విక్‌ 
ఫిన్‌టెక్‌ కంపెనీ మొబిక్విక్‌ (Mobikwik) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 55 కోట్ల నికర నష్టం ప్రకటించింది. పేమెంట్‌ గేట్‌వే వ్యయాలు పెరగడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 5 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది.

వన్‌ మొబిక్విక్‌ గేట్‌వే చెల్లింపుల వ్యయాలు మూడు రెట్లు పెరిగి రూ. 144 కోట్లకు చేరాయి. గత క్యూ3లో ఇవి రూ. 51 కోట్లు మాత్రమే. మొత్తం ఆదాయం మాత్రం 18 శాతం ఎగసి రూ. 269 కోట్లను అధిగమించింది. పేమెంట్స్‌ స్థూల మెర్కండైజ్‌ విలువ మూడు రెట్లుపైగా జంప్‌చేసి రూ. 29,400 కోట్లయ్యింది. రిజిస్టర్డ్‌ వినియోగదారుల సంఖ్య 14 శాతం వృద్ధితో 17.2 కోట్లను తాకింది. పేమెంట్స్‌ ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 196 కోట్లను దాటింది.

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)