Breaking News

పుతిన్‌ ప్రశ్నకు మనోడి జవాబు

Published on Sat, 11/28/2026 - 18:04

కృత్రిమ మేధ విద్యార్థుల అభ్యసనాన్ని సులభతరం చేస్తుందా, లేక స్వతంత్రంగా ఆలోచించే శక్తిని హరిస్తుందా? ప్రపంచవ్యాప్తంగా విద్యారంగాన్ని వేధిస్తున్న ఈ కీలక ప్రశ్నను ఓ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కేరళకు చెందిన భారత యువ ఏఐ ఆవిష్కర్త రౌల్‌ జాన్‌ అజును అడిగారు. మాస్కోలో ఇటీవల జరిగిన ‘ఏఐ జర్నీ 2026’ అంతర్జాతీయ సదస్సులో పుతిన్‌, కజకిస్థాన్‌ అధ్యక్షుడు కాసిమ్‌-జోమార్ట్‌ టోకాయెవ్‌ భారత్‌, రష్యా, కజకిస్థాన్‌లకు చెందిన యువ సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐ వినియోగంపై పుతిన్‌ వ్యక్తం చేసిన సందేహాలకు రౌల్‌ ఇచ్చిన సమాధానం సదస్సులో అందరి దృష్టిని ఆకర్షించింది.

పుతిన్‌ ప్రశ్న.. రౌల్‌ సమాధానం

విద్యార్థులు ఏఐని కేవలం ప్రాంప్ట్‌ ఇచ్చి సమాధానాలు రాబట్టుకునే యంత్రంగా వాడితే.. వారిలో స్వయంగా ఆలోచించడం, తర్కం, విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని పుతిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి బదులిచ్చిన రౌల్‌, ఏఐని అర్థం చేసుకోవడానికి ‘కాలిక్యులేటర్‌’ ఉదాహరణను ప్రస్తావించారు. గణితంలో ప్రాథమిక సూత్రాలు నేర్చుకున్న తర్వాతే కాలిక్యులేటర్‌ వాడకానికి అర్థం ఉంటుందని, భారత్‌లో 11వ తరగతి వరకు కాలిక్యులేటర్లను అనుమతించరని గుర్తుచేశారు. అదే విధంగా విద్యార్థులు మొదట ప్రతి సబ్జెక్టులోని బేసిక్స్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలన్నారు. ఆ తర్వాతే వ్యాస రచన, సమస్యల పరిష్కారం వంటి నైపుణ్యాలకు ఏఐని ఉపయోగించాలని స్పష్టం చేశారు.

తరగతి గదిలో..

40 మంది విద్యార్థులు ఉన్న తరగతి గదిలో ఒక్కో విద్యార్థి అభ్యసన వేగానికి అనుగుణంగా ఒకే ఉపాధ్యాయుడు బోధించడం కష్టమని రౌల్‌ విశ్లేషించారు. ఇక్కడే ఏఐ ఒక సహాయకారిగా మారుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైతం తమ మాతృభాషలో, చిత్రాలు, వీడియోలు, ఆటల ద్వారా క్లిష్టమైన అంశాలను సులభంగా నేర్చుకోవడానికి తాను రూపొందించిన ‘థింక్‌క్రాఫ్ట్‌’ వేదిక ఉపయోగపడుతుందని వివరించారు.

మన ఆలోచనలను ఏఐతో భర్తీ చేయడం కాకుండా, దానితో కలిసి పనిచేయాలన్న రౌల్‌ వ్యాఖ్యలను పుతిన్‌ ప్రశంసిస్తూ అతని కృషి భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ దార్శనికతను సాకారం చేసే దిశగా ఉందని కొనియాడారు. సాంకేతికత ఎంత ఎదిగినా మానవ మేధస్సే అసలైన చోదకశక్తి అన్న సందేశాన్ని ఈ భేటీ బలంగా చాటింది.

ఇదీ చదవండి: ధరలతో చిర్రెత్తిన ఉల్లి, వెల్లుల్లి!

Videos

TDP నేత రాసలీలలు.. బయటపడ్డ సంచలన వీడియో

స్కూల్ బస్సు టైర్ల గాలి తీసిన సర్పంచ్ అక్క

హ్యాట్రిక్ కొట్టిన భారత అమ్మాయిలు.. నాలుగోసారి ఆసియా విజేతగా భారత్

బాపట్లలో ఉద్రిక్తత.. ఆమంచి కారుపై దాడి

బిర్యానీ వదిలేసి.. కూలీల భోజనంతో..! జగ్గూభాయ్ సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే

జనసేన ఉద్యోగాల స్కామ్ లో కీలక పరిణామం

అన్నమయ్య జిల్లాలో దారుణం.. మహిళలపై లాఠీ ఛార్జ్

పోలింగ్ బూత్ లో రౌడీ షీటర్ హల్చల్

YSRCP నేతలను దారుణంగా కొట్టిన TDP గూండాలు

బ్యాంకుల బంపరాఫర్.. రూ.2 లక్షలు FD చేస్తే.. రూ.1 లక్ష వడ్డీ!

Photos

+5

బ్లాక్ డ్రెస్‌లో కీర్తి సురేశ్‌ గ్లామరస్ లుక్స్‌ (ఫోటోలు)

+5

సాక్షి ‘స్పెల్‌ బీ’కి విశేష స్పందన (ఫొటోలు)

+5

‘గాగ్రాచోళి’లో గ్లామర్‌ మెరుపులు.. ‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ సాత్విక వీరవల్లి(ఫోటోలు)

+5

‘అలియాస్ రుక్మిణి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో జాన్వీ కపూర్‌ సందడి (ఫోటోలు)

+5

గ్లామర్ షోతో అదరగొట్టిన హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ (ఫొటోలు)

+5

నీరో మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ గ్రాండ్‌ ప్రెస్‌ మీట్‌ (ఫోటోలు)

+5

‘ఇడుపు కాయితం’ మూవీ ఉల్లిపూల సాంగ్‌ రిలీజ్ (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన ప్రాంతం... ఎక్కడో మీకు తెలుసా? (ఫోటోలు)