Breaking News

ఒక్క రూపాయి క్యాండీ.. రూ.750 కోట్ల బ్రాండ్‌..

Published on Fri, 06/27/2025 - 19:58

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ క్యాండీ ఉత్పత్తి ’పల్స్‌’ రూ. 1,000 కోట్ల బ్రాండుగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు దేశీ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ధరమ్‌పాల్‌ సత్యపాల్‌ గ్రూప్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఒక్కోటి రూ. 1 ఖరీదు చేసే ఈ క్యాండీలు గత ఆర్థిక సంవత్సరంలో 750 కోట్ల యూనిట్లు అమ్ముడవడం ద్వారా రూ. 750 కోట్ల అమ్మకాల మార్కును సాధించినట్లు వివరించారు.

హార్డ్‌–బాయిల్డ్‌ క్యాండీ విభాగంలో 19 శాతం మార్కెట్‌ వాటాతో తాము అగ్రగామిగా ఉన్నామని, గత మూడళ్లుగా ఏటా 15% వృద్ధి సాధిస్తున్నా మని కుమార్‌ చెప్పారు. దేశీయంగా ఈ మార్కెట్‌ పరిమాణం సుమారు రూ. 4,000 కోట్లుగా ఉంది. 2015లో పల్స్‌ క్యాండీని ప్రవేశపెట్టారు.  

ఈ ఉత్పత్తి దాని ప్రారంభ రోజుల్లో సోషల్ మీడియా బజ్, యూజర్-జనరేటెడ్ కంటెంట్ నుండి కూడా ప్రయోజనం పొందిందని కంపెనీ పేర్కొంది. సెలబ్రిటీ పోస్టులు, వైరల్ యూజర్‌ రివ్యూలు  పల్స్ క్యాండీ తక్కువ మార్కెటింగ్ ఖర్చుతో కల్ట్ హోదాను సాధించడానికి సహాయపడ్డాయి. దీంతో అనతి కాలంలోనే డీఎస్ గ్రూప్ పల్స్ లైనప్ ను విస్తరించింది. లాంచ్ అయినప్పటి నుండి సుమారు 5,000 కోట్ల పల్స్ క్యాండీలు అమ్ముడయ్యాయి. ప్రారంభంలో కచ్చా ఆమ్ (పచ్చి మామిడి) ఫ్లేవర్‌ క్యాండీలు ఉండగా జామ, ఆరెంజ్, పైనాపిల్, లిచీ వేరియంట్లు తర్వాత వచ్చాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)