Breaking News

ప్రభుత్వ బ్యాంకుల భారీ డివిడెండ్‌

Published on Mon, 03/25/2024 - 06:25

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్చితో ముగియనున్న ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో భారీ డివిడెండ్‌ను చెల్లించే వీలుంది. ఇందుకు  లాభదాయకత మెరుగుపడటం సహకరించనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది పీఎస్‌యూ బ్యాంకులు రూ. 15,000 కోట్లకుపైగా డివిడెండును చెల్లించే అవకాశముంది. ఈ ఏడాది ఇప్పటికే తొలి మూడు త్రైమాసికాల(ఏప్రిల్‌–డిసెంబర్‌)లో 12 పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 98,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి.

గతేడాది(2022–23)లో ఉమ్మడిగా సాధించిన నికర లాభానికంటే రూ. 7,000 కోట్లుమాత్రమే తక్కువ. గతేడాదిలోనే ప్రభుత్వ బ్యాంకులు చరిత్రలోనే అత్యధికంగా రూ. 1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. అంతక్రితం ఏడాది(2021–22)లో కేవలం రూ. 66,540 కోట్ల నికర లాభం నమోదైంది. గతేడాది ప్రభుత్వం పీఎస్‌యూ బ్యాంకుల నుంచి 58 శాతం అధికంగా రూ. 13,804 కోట్ల డివిడెండ్‌ను అందుకుంది.

అంతక్రితం ఏడాదిలో రూ. 8,718 కోట్ల డివిడెండ్‌ మాత్రమే చెల్లించాయి. వెరసి ఈ ఏడాది రికార్డ్‌ స్థాయిలో ప్రభుత్వానికి పీఎస్‌యూ బ్యాంకులు డివిడెండును చెల్లించనున్నట్లు అంచనా. కాగా.. ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 6 శాతానికంటే తక్కువగా నమోదైన బ్యాంకులు మాత్రమే డివిడెండ్‌ ప్రకటించేందుకు వీలుంటుంది. అయితే వచ్చే ఏడాది(2024–25) నుంచి మాత్రమే తాజా మార్గదర్శకాలు అమలుకానున్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)