ఎస్‌ఎంఎస్‌ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు

Published on Sat, 02/14/2026 - 13:33

టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్‌లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్‌ఎంఎస్‌కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితా

ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14
కెనరా బ్యాంక్506.28
పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89
బ్యాంక్ ఆఫ్ బరోడా202.42

 

గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐ 2020 నుంచి ఎస్‌ఎంఎస్‌ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.

ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?

ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్‌ఎంఎస్‌కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్‌ఎంఎస్‌ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్‌టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.

కేవలం ఎస్‌ఎంఎస్‌లే కాదు.. ఏటీఎంలు కూడా!

గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్‌ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్‌కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్‌డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.

సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్‌ఎంఎస్‌లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్‌బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.

ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)