Breaking News

దెబ్బకు దిగొచ్చిన ప్రైవేటు బంకులు

Published on Fri, 05/05/2023 - 08:41

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్‌ను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్‌ బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు ఏడాది తర్వాత మార్కెటింగ్‌ ధరలను అనుసరిస్తున్నాయి. ఇంతకాలం ఇవి ప్రభుత్వరంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీ పెట్రోల్‌ బంకులతో పోలిస్తే కాస్త అధిక రేట్లకే అమ్మకాలు సాగించాయి. అయినా కానీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే గణనీయ నష్టాలను చవిచూశాయి. దీనికి కారణం ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఏడాదికి పైగా ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు దిగి రావడంతో రిలయన్స్‌–బీపీ, నయారా ఎనర్జీ, షెల్‌ సంస్థలు ప్రభుత్వరంగ సంస్థలు అనుసరిస్తున్న మార్కెట్‌ ధరలకే విక్రయించడం మొదలుపెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

ముఖ్యంగా గత ఆరు వారాల్లో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో నష్టాలు కూడా తగ్గిపోవడంతో పీఎస్‌యూ పెట్రోల్‌ బంకుల్లో విక్రయించే రేట్లనే రిలయన్స్‌ బీపీ, షెల్, నయారా అనుసరిస్తున్నాయి. నయారాకు దేశవ్యాప్తంగా 86,855 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. మార్చి నెల నుంచే మార్కెట్‌ రేట్లకు విక్రయాలు మొదలు పెట్టింది. రిలయన్స్‌ బీపీ సంస్థకు 1,555 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. ఈ నెల నుంచి డీజిల్‌ను మార్కెట్‌ ధరలకు (ప్రభుత్వరంగ సంస్థలు పాటించే) విక్రయాలు చేస్తోంది. రిలయన్స్‌ బీపీ సంస్థ ప్రత్యేకమైన డీజిల్‌ను మన దేశంలో విక్రయిస్తోంది. మన దేశ రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా, మెరుగైన మేలేజీ వచ్చేలా అడిటివ్స్‌ కలిపి విక్రయిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)