Breaking News

హైదరాబాద్‌లో ఇళ్ల  ధరల్లో స్వల్ప పెరుగుదల 

Published on Fri, 01/31/2025 - 06:23

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 3 శాతం పెరిగి చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ) ధర రూ.7,053కు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం (2023 అక్టోబర్‌–డిసెంబర్‌)లో ఇది రూ.6,842గా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది నగరాల్లోనూ ఇళ్ల ధరలు పెరుగుదలను చూసినట్టు హౌసింగ్‌ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ వెల్లడించింది. గడిచిన రెండేళ్లలోనూ ఇళ్ల ధరలు దేశవ్యాప్తంగా పెరిగిపోవడం గమనార్హం. అత్యధికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో ఇళ్ల ధరలు 49 శాతం ఎగిశాయి. ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.8,105కు చేరింది. 

ప్రధానంగా లగ్జరీ ఇళ్లకు (విలాసవంతమైన) డిమాండ్‌ పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. అలాగే, నిర్మాణ సామగ్రి, కార్మికుల వ్యయాలు కూడా పెరిగినట్టు పేర్కొంది. ‘‘ధరల్లో ఈ స్థాయి పెరుగుదల అన్నది అంతర్గతంగా ఉన్న డిమాండ్‌కు నిదర్శనం. వృద్ధి అవకాశాలకుతోడు సానుకూల కొనుగోళ్ల సెంటిమెంట్‌ మద్దతుగా నిలిచింది. ఇళ్ల కొనుగోలుకు ఎక్కువ మంది ప్రజలు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో ధరల పెరుగుదల ఒత్తిళ్లు కొనుగోలు సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయన్న ఆందోళనకు దారితీయవచ్చు’’అని హౌసింగ్‌ డాట్‌కామ్‌ అండ్‌ ప్రాప్‌ టైగర్‌ గ్రూప్‌ సీఈవో ధ్రువ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం విధానపరమైన చర్యలతో ముందుకు రావాలని కోరారు.   

పట్టణాల వారీగా పెరుగుదల 
→ బెంగళూరులో ఇళ్ల ధరలు సగటున 12 శాతం పెరిగాయి. 2024 డిసెంబర్‌ చివరికి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.7,536కు చేరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇది రూ.6,744గా ఉంది.  
→ చెన్నైలో ఎస్‌ఎఫ్‌టీ ధర 16 శాతం వృద్ధితో రూ.7,173కు చేరింది.  
→ అహ్మదాబాద్‌లో 10 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.4,402కు చేరింది.  
→ కోల్‌కతాలోనూ 10 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.5,633కు చేరింది. 
→ ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో 18% ధర లు పెరిగాయి. ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.10,712 నుంచి ఏడాదిలో రూ.12,600కు చేరింది. 
→ పుణెలో 16 శాతం పెరిగి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.7,108కి చేరింది.   
 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు