AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్‌కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్‌పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్‌తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్‌కు దివ్య మిట్టల్ గుడ్‌బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
స్థిరాస్తులు.. డాక్యుమెంట్లు-1: అన్నీ పక్కాగా ఉంటేనే..
Published on Mon, 10/09/2023 - 10:44
ఏ వ్యవహారమైనా కాగితాలు ముఖ్యం. వ్యవహారాన్ని మొదలుపెట్టిన దగ్గర్నుంచి పూర్తి చేసే వరకు ప్రతి స్థాయిలో, ప్రతి దశలో, ప్రతి అంశానికి సంబంధించిన కాగితాలు.. అవేనండి.. డాక్యుమెంట్లు అవసరం. అవేమిటో కొన్ని చూద్దాం..
కొనే ముందు డాక్యుమెంట్లు..
- స్థిరాస్తి డాక్యుమెంట్లలో అతి ముఖ్యమైనవి అమ్మకానికి సంబంధించిన దస్తావేజులు. అమ్మే వ్యక్తి ఆ ఆస్తిని ఎలా కొన్నారు? తను కొన్నట్లు ధృవీకరించే దస్తావేజులు.
- అమ్మకం ద్వారా లేదా మరే ఇతర మార్గంలో హక్కు ఏర్పడ్డా, దానికి సంబంధించిన కాగితాలు. ఉదాహరణకు, వీలునామా లేదా గిఫ్ట్ డీడ్. ఈ రెండింటినీ టైటిల్ డీడ్స్ అంటారు. వీటి ద్వారానే మీకు ఆస్తి అమ్మే వ్యక్తికి అమ్మే హక్కు సంక్రమించినట్లు తెలుస్తుంది. ఆస్తి తనదా కాదా అని తెలుస్తుంది. ఇవి ఒరిజినల్ అయి ఉండాలి.
- లింకు డాక్యుమెంట్లు చూడాలి. మీకు అమ్మే వ్యక్తి, సదరు అసెట్‌ను కొనుక్కోవడానికి ముందు ఓనర్ ఎవరు? ఆ ఓనర్‌కి ఆస్తి ఎలా సంక్రమించింది? ఇది చాలా ముఖ్యం.
- సబ్ రిజిస్ట్రార్ లేదా పంచాయతీ/గ్రామ వ్యవస్థలో ఉండే రికార్డులు .. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో ఉంటాయి. పహాణీ/ఖాతా.. సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు, సరిహద్దులు మొదలైనవి ఉంటాయి.
- మ్యుటేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల్లో స్థిరాస్తిలో పేరు మార్పిడి, టైటిల్ మార్పునకు సంబంధించిన పత్రాలు, ప్రస్తుతం మీకు అమ్మే వ్యక్తి పేరు మ్యుటేషన్ పత్రంలో ఉండాలి.
- ఫ్లాట్ అయితే జాయింటు డెవలప్‌మెంటు అగ్రిమెంటు కాపీలు ఉండాలి. ఈ అగ్రిమెంటు ద్వారా హక్కుల సంక్రమణ జరుగుతుంది.
- జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఒక్కొక్కప్పుడు ఓనరు ఒకరు కాగా, అమ్మకానికి హక్కులు వేరే వ్యక్తికి ఇస్తారు. పవర్ ఉన్న వాళ్లు అమ్మాలి.
- బిల్డింగ్ ప్లాను. అనుమతి పొందిన ప్లాను. సంబంధిత అధికారులు జారీ చేసినది.
- సంబంధిత అధికారులు జారీ చేసిన ఎన్‌వోసీ. అలాగే విద్యుత్ శాఖ, నీటి శాఖ మొదలైన శాఖలు ఇచ్చినవి.
- ఒరిజినల్ అగ్రిమెంటుకు జరిగిన మార్పులు, చేర్పులు, కూర్పులకు సంబంధించిన సప్లిమెంటరీ అగ్రిమెంటు లేదా వాటిని ఒప్పుకుంటున్నట్లు ఒప్పందం.
- అలాట్‌మెంట్ లెటర్. కట్టడానికి రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగించినట్లు పత్రం, వీలుంటే అమ్మే వ్యక్తి తను కొన్నప్పుడు చేసిన చెల్లింపుల కాగితాలు, రశీదులు.
- మీరు కొంటున్న స్థిరాస్తిని ఆ ఓనరు బ్యాంకు నుండి అప్పు తీసుకుని కొని ఉంటే తత్సంబంధ కాగితాలు.
- మున్సిపల్ పన్నులు, కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, ఆఖ కాగితాలు, చెల్లింపుల రశీదులు, సొసైటీ మెంబర్‌షిప్ కాగితాలు, వారిచ్చే ధృవీకరణ పత్రాలు.
- సబ్–రిజిస్ట్రార్ నుండి ఒరిజినల్ ఉఇ. వీలున్నంతవరకు ఎన్ని సంవత్సరాల దాకానైనా వెళ్లండి. అలాగే 2001 ఏప్రిల్ 1 నాటి మార్కెట్ వేల్యు సర్టిఫికెట్టు, దానితో పాటు తాజాది అంటే మీరు కొనే నాటికి స్థిరాస్తి మార్కెట్ వేల్యుయేషన్ సర్టిఫికెట్ చూసుకోండి.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్‌కు పంపించగలరు.
#
Tags : 1