Breaking News

‘మస్క్‌ ఒక విలన్‌.. అందుకే రాజీనామా’

Published on Sun, 12/01/2024 - 15:46

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్‌కు తీరుపట్ల యూకేలోని రాయల్‌ సొసైటీ సైంటిస్ట్‌లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో న్యూరో సైకాలజిస్ట్‌ ప్రొఫెసర్‌, గతంలో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ అందుకున్న డొరొతీ బిషప్ తన ఫెలోషిప్‌కు రాజీనామా చేశారు. ఇలాన్‌మస్క్ వివాదాస్పద ప్రవర్తనను నిరసిస్తూ బిషప్‌ రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రాయల్‌సొసైటీ ప్రముఖ సైంటిస్ట్‌లు, ఇంజినీర్లు, టెక్నాలజీస్ట్‌లకు వేదికని ఆమె అన్నారు.

బిషప్‌ ‘గట్‌ రియాక్షన్‌’

రాయల్‌సొసైటీ ఫెలోషిప్‌ అందుకున్న మస్క్‌ ప్రవర్తన సరిగా లేదని, అలాంటి వ్యక్తితో సమానంగా ఫెలోషిప్‌ పంచుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. రాయల్‌సొసైటీలో ఇలాన్‌మస్క్ సభ్యత్వాన్ని కొనసాగించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధానపరమైన నిష్పాక్షికతకు రాయల్ సొసైటీ సింబాలిక్‌గా నిలిచిందన్నారు. అలాంటిది మస్క్ చర్యలతో సంస్థ ప్రతిష్ట మసకబారుతుందని పేర్కొన్నారు. బిషప్ రాజీనామాను కొందరు ‘గట్ రియాక్షన్’గా అభివర్ణించారు. మస్క్ తన అపారమైన సంపదను, పలుకుబడిని ఉపయోగించి తనతో విభేదించిన వారిని, ముఖ్యంగా శాస్త్రవేత్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బిషప్ విమర్శించారు. ఆమె మస్క్‌ను ‘బాండ్ విలన్’తో పోల్చారు.

ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు?

డబ్బు విరాళం ఇచ్చి డోజ్‌ సారథిగా..

అంతరిక్ష అన్వేషణ, ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణలో చేసిన కృషికి గాను 2018లో రాయల్ సొసైటీ ఫెలోగా ఇలాన్‌మస్క్ ఎన్నికయ్యారు. క్రమంగా తాను కొన్ని అంశాలపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయ పలుకుబడి, సోషల్ మీడియాలో చేసిన తప్పుడు ప్రచారాలకు సంబంధించి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి ఆయన పెద్ద మొత్తంలో డబ్బును విరాళం ఇచ్చారని, దానివల్ల యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డోజ్‌) సారథిగా నియమితులయ్యారనే వాదనలున్నాయి. ఈ చర్యలను పరిగణించి రాయల్ సొసైటీ తన ఫెలోషిప్‌ను పునఃపరిశీలించాలనే డిమాండ్‌ వ్యక్తమవుతుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)