Breaking News

‘జెమ్‌’పై రూ.2 లక్షల కోట్ల కొనుగోళ్లు

Published on Sat, 11/18/2023 - 01:13

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఈ మార్కెట్‌ ప్లేస్‌ అయిన ‘జెమ్‌’పై వస్తు, సేవల కొనుగోళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించాయి. వివిధ శాఖలు, విభాగాల నుంచి కొనుగోళ్ల కార్యకలాపాలు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌లో (ఎక్స్‌) పేర్కొన్నారు. జెమ్‌ను కేంద్ర సర్కారు 2016 ఆగస్ట్‌ 9న ప్రారంభించడం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించారు.

2021–22 ఆర్థిక సంవత్సరానికి జెమ్‌పై కొనుగోళ్ల విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంటే, గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనుగోళ్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెమ్‌పై 62 లక్షల విక్రేతలు, సరీ్వస్‌ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. 63,000 ప్రభుత్వ కొనుగోళ్ల విభాగాలు కూడా నమోదై ఉన్నాయి.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పారా మిలటరీ దళాలు కొనుగోలుదారుల జాబితాలో ఉన్నాయి. స్టేషనరీ నుంచి వాహనాలు, కంప్యూటర్, ఫర్నిచర్‌ వరకు అన్ని రకాల విక్రేతలు దీనిపై నమోదై ఉన్నారు. సేవల విభాగంలో రవాణా, లాజిస్టిక్స్, వ్యర్థాల నిర్వహణ, వెబ్‌కాస్టింగ్‌కు సంబంధించిన సంస్థలు ఉన్నాయి. మొత్తం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల వాటా 83 శాతంగా ఉన్నట్టు వాణిజ్య శాఖ తెలిపింది. మొత్తం 312 రకాల సేవలు, 11,800 ఉత్పత్తులు జెమ్‌పై విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. జెమ్‌ ఆరంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.5.93 లక్షల కోట్ల కొనుగోళ్లు జరిగాయి.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)