ప్రైవేట్ బ్యాంకుల క్రెడిట్‌కార్డులపై కొత్త చార్జీలు.. జూలై 1 నుంచి..

Published on Sun, 06/01/2025 - 16:21

ప్రైవేట్ బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలపై ఛార్జీలను పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ రెండూ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించాయి. కొత్త చార్జీలను ప్రవేశపెడుతున్నాయి. ఇవి జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు కస్టమర్లకు ఆయా బ్యాంకులు నోటిఫికేషన్లు పంపించాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్పులివే.. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లావాదేవీల నిబంధనలను సవరించింది. గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ ఛార్జీలపై  జూలై 1 నుండి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది. డ్రీమ్ 11, రమ్మీ కల్చర్, జంగ్లీ గేమ్స్ లేదా ఎంపీఎల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ లావాదేవీలు చేస్తే 1% ఛార్జీ వర్తిస్తుంది. ఇది గరిష్టంగా రూ.4,999గా ఉంటుందని, ఆన్ లైన్ గేమింగ్ లావాదేవీలపై ఎలాంటి రివార్డు పాయింట్లు లభించవని బ్యాంక్‌ తెలిపింది.

క్రెడిట్ కార్డును ఉపయోగించి పేటీఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్ లేదా ఓలా మనీ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నెలకు రూ .10,000 కంటే ఎక్కువ వాలెట్‌ లోడింగ్‌ చేస్తే 1% చార్జీ వసూలు చేస్తారు. నెలకు మొత్తం వాలెట్ లోడింగ్ ఖర్చుకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. గరిష్టంగా రూ .4,999 ఉంటుంది.

క్రెడిట్‌ కార్డులతో నెలకు రూ.50,000 లకు మించిన యుటిలిటీ లావాదేవీలపై 1% ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.  నెలకు మొత్తం యుటిలిటీ ఖర్చులకు ఈ ఛార్జీ వర్తిస్తుంది. ఇది రూ .4,999 వరకు ఉంటుంది. అయితే బీమా లావాదేవీలను యుటిలిటీ లావాదేవీలుగా పరిగణించబోమని, అందువల్ల వీటిపై ఎలాంటి ఛార్జీలు వర్తించవని బ్యాంక్ స్పష్టం చేసింది.

👉ఇది చదివారా? కొత్త ఈపీఎఫ్‌వో.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. జూన్‌ 1 నుంచి కీలక మార్పులు

రెంట్, ఫ్యూయల్, ఎడ్యుకేషన్ కేటగిరీలకు సంబంధించి ఒక్కో లావాదేవీకి గరిష్ట ఛార్జీని రూ.4,999గా నిర్ణయించారు. ప్రస్తుతం రూ .15,000 మించిన ఇంధన లావాదేవీలపై మాత్రమే  1% ఛార్జీ వసూలు చేస్తున్నారు. జూలై 1 నుంచి అన్ని అద్దె లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. అయితే కాలేజీ/స్కూల్ వెబ్‌సైట్లు  లేదా వాటి పీఓఎస్ మెషీన్లలో థర్డ్ పార్టీ యాప్ చెల్లింపుల ద్వారా చేసే విద్యా లావాదేవీలకు మాత్రం ఎటువంటి ఛార్జీలు వసూలు చేయరు.

ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలు
డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్), పీవో (పే ఆర్డర్), ఏటీఎం ఇంటర్‌చేంజ్, ట్రాన్సాక్షన్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డు ఫీజులను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. నగదు డిపాజిట్, చెక్కు, డీడీ, పీవో బదిలీకి ఛార్జీలను ప్రతి రూ.1000కు రూ.2గా సవరించింది. ఇది కనిష్ఠంగా రూ.50, గరిష్టంగా రూ.15 వేలు ఉంటుంది. గతంలో రూ.10,000 వరకు అయితే రూ.50, రూ.10,000 దాటితే ప్రతి రూ.1000కు రూ.5 చొప్పున జనరల్‌ చార్జీలు వసూలు చేసేవారు.

ఏటీఎం ఇంటర్ఛేంజ్ లావాదేవీలకు 3 మూడు దాటితే ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ.23, ఆర్థికేతర లావాదేవీకైతే రూ.8.5 లుగా బ్యాంకు సవరించింది. ఇవి గతంలో వరుసగా రూ.21, రూ.8.5లుగా ఉండవి. ఇక ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు 5 దాటితే ఒక్కో ట్రాన్సాక్షన్‌కు ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. డెబిట్ కార్డు వార్షిక ఫీజును రూ.200 నుంచి రూ.300కు, రీప్లేస్ మెంట్ కార్డు ఫీజును రూ.200 నుంచి రూ.300కు పెంచారు.

Videos

తెలంగాణ కుంభమేళా.. మేడారంకు క్యూ కట్టిన భక్తులు

రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్

ఐర్లాండ్ లో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు

ఎవరి మక్కెలు ఇరగదీస్తావ్..? పవన్ పై కారుమూరి వెంకట్ రెడ్డి ఫైర్

2019 రియల్టర్ హత్య కేసు.. CBI అదుపులో DK ఫ్యామిలీ

పేకాట డాన్లుగా.. టీడీపీ నేతలు

ఏం పీకుతామా!.. జగన్ వచ్చాక తెలుస్తది

చావును జయిస్తా.. ఏడాదికి 166 కోట్లు

లోకేష్ బూతులకు YSRCP పగిలిపోయే రిప్లే

ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ! బంగ్లాదేశ్ హిందూ హత్య కేసులో సంచలన విషయాలు

Photos

+5

పూల డ్రస్‌లో మెరిసిపోతున్న సంయుక్త (ఫొటోలు)

+5

నిర్మాత బర్త్ డే.. బాలీవుడ్ అంతా ఇక్కడే కనిపించారు (ఫొటోలు)

+5

కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)

+5

'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రిస్మస్‌ కళ.. అందంగా ముస్తాబైన చర్చిలు (ఫొటోలు)

+5

దుల్కర్ సల్మాన్ పెళ్లిరోజు.. భార్య గురించి క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి తర్వాత సమంత ఎలా మెరిసిపోతుందో చూశారా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోషన్, కమెడియన్ రఘు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో క్తీరి సురేశ్ హంగామా (ఫొటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రెస్ మీట్ లో డింపుల్ హయాతి (ఫొటోలు)