Breaking News

ఇళ్ల ధరలు: మూడేళ్లలోనే ఎంత మార్పు?

Published on Thu, 11/27/2025 - 14:26

దేశ లగ్జరీ హౌసింగ్ మార్కెట్ ఏటేటా పెరిగిపోతోంది. రియల్‌ ఎ‍స్టేట్‌ రీసెర్చ్‌ సంస్థ అనరాక్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత మూడేళ్లలో ఇతర అన్ని రెసిడెన్సియల్‌ కేటగిరీలను అధిగమించింది. రూ.1.5 కోట్లకు పైబడి ధర కలిగిన గృహాలు దేశంలోని టాప్ ఏడు నగరాల్లో సగటున 40% ధరల పెరుగుదలను నమోదు చేశాయి. దేశ రాజధాని ప్రాంతం (NCR) 72% ఎదుగుదలతో అత్యధిక ధరల పెరుగుదల నమోదు చేసింది. ఈ విభాగంలో ఇక్కడ 2022లో చదరపు అడుగు సగటు ధర రూ. 13,450 ఉండగా 2025 నాటికి రూ. 23,100 లకు పెరిగింది.

ఈ బడ్జెట్ విభాగంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) 43 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, బెంగళూరు 42 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మన భాగ్య నగరం హైదరాబాద్ ఈ ర్యాలీలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. 2022–2025 మధ్య లగ్జరీ సెగ్మెంట్‌లో 41% పెరుగుదలను నమోదు చేసి, ధరల పెరుగుదల పరంగా టాప్ పెర్ఫార్మర్లలో ఒకటిగా నిలిచింది.

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఇలా..

ప్రస్తుతం హైదరాబాద్‌లో వివిధ కేటగిరీలలో ఇళ్ల సగటు ధరలు ఇలా ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్ విభాగంలో చదరపు అడుగుకు రూ.14,200 గా ఉంది. మిడ్-రేంజ్ / ప్రీమియం కేటగిరిలో చదరపు అడుగుకు సగటున రూ.8,420 ధర నడుస్తోంది. ఇక అఫోర్డబుల్ విభాగంలో చదరపు అడుగు ధర రూ.5,235 వద్ద ఉంది.

ధరల పెరుగుదల పరంగా భాగ్య నగరం బలమైన పనితీరు చూపుతున్నప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్ ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా, అందుబాటు ధరలు కలిగినదిగానే ఉంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)