పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలు

Published on Thu, 01/23/2025 - 14:38

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌(Budget 2025-26)లో పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు కోరుతున్నట్లు గ్రాంట్ థార్టన్‌ భారత్(Grant Thornton Bharat) ఇటీవల నిర్వహించిన ప్రీ-బడ్జెట్ సర్వేలో వెల్లడించింది. 500 మందికి పైగా పన్ను చెల్లింపుదారుల నుంచి సేకరించిన వివరాలతో ఈ సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. సర్వేలో వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

తక్కువ పన్ను రేట్లు: ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని 57 శాతం మంది ప్రతివాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అధిక మినహాయింపు పరిమితులు: 25 శాతం పన్ను చెల్లింపుదారులు తమ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి అధిక మినహాయింపులు ఆశిస్తున్నారు.

కొత్త పన్ను విధానం: 72 శాతం పన్ను చెల్లింపుదారులు కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పటికీ, 63 శాతం మంది ఇప్పటికీ పాత విధానంలో ప్రోత్సాహకాలను పెంచాలని కోరుతున్నారు.

నష్టాలు పూడ్చడానికి అనుమతి: కొత్త పన్ను విధానం ప్రకారం ఇంటి ఆస్తి నష్టాలను పూడ్చడానికి అనుమతించాలని 53 శాతం మంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో రూ.10కే టీ, రూ20కే సమోసా!

చెల్లింపుదారుల మనోభావాలు

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు తమ డిస్పోజబుల్ ఆదాయాన్ని(టాక్స్‌లు చెల్లించిన తర్వాత ఖర్చు చేయడానికి అనువైన డబ్బు) పెంచుకోవడానికి వ్యక్తిగత పన్ను విషయంలో ఉపశమనం పొందాలని చూస్తున్నారు. తక్కువ పన్ను రేట్లు, అధిక మినహాయింపు పరిమితులు కోరుతున్నట్లు సర్వేలోని అంశాల ద్వారా తెలుస్తుంది. ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంటే ఖర్చులను మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడుతుందని ప్రతివాదులు నమ్ముతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)