Breaking News

ఎన్‌పీసీఐకి ప్రవీణా రాయ్ రాజీనామా: ఎంసీఎక్స్‌లో కొత్త బాధ్యతలు

Published on Fri, 11/01/2024 - 07:43

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ 'ప్రవీణా రాయ్' తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం 'మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్' (ఎంసీఎక్స్) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఆర్థిక సేవల రంగంలో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన ప్రవీణా రాయ్ ఎంసీఎక్స్‌లో నియామకానికి 'సెబీ' ఆమోదం తెలిపింది. రాయ్ ఎన్‌పీసీఐలో చేరటానికి ముందు కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్‌బీసీలలో కూడా పనిచేశారు.

ఇదీ చదవండి: బీపీఎల్ ఫౌండర్‌ టీపీజీ నంబియార్ కన్నుమూత

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన ప్రవీణా రాయ్.. ఐఐఎం అహ్మదాబాద్‌లో పేజీ చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకులో చేరినప్పుడు ఈమె క్యాష్ మేనేజ్‌మెంట్‌ పోర్ట్ ఫోలియో నిర్వహించారు. ఆ తరువాత హెచ్ఎస్‌బీసీలో ఆసియా - పసిఫిక్ రీజియన్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎన్‌పీసీఐలో రాయ్ మార్కెటింగ్, ప్రొడక్ట్, టెక్నాలజీ, బిజినెస్ స్ట్రాటజీ, ఆపరేషన్ డెలివరీ వంటి బాధ్యలు నిర్వహించారు. ఇప్పుడు ఎంసీఎక్స్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు చేపట్టారు.

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు