Breaking News

కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఇవన్నీ ఉచితం..

Published on Thu, 11/21/2024 - 19:59

ఇప్పుడు చాలామంది సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడతారు. అయితే దీని కోసం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా ఇండియా పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్.. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ తీసుకు వచ్చింది. ఇందులో కొన్ని కార్యక్రమాలు ఉచితం అంటూ ప్రకటించింది.

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్'ను ఆవిష్కరించింది. దీని ద్వారా రామాయణం, మహాభారతం వంటి వాటిని ఉచితంగా చూడవచ్చు. దీనిని ఆండ్రాయిడ్‌లో గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్‌లో యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రామాయణ, మహాభారతం వంటి వాటితో పాటు.. రేడియో ప్రోగ్రామ్స్, గేమ్స్ వంటి వాటిని కూడా దీని ద్వారా ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఈ వేవ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 65 లైవ్ ఛానెల్స్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ వంటి 12 కంటే ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ ప్లాట్‌ఫామ్‌ 10 కంటే ఎక్కువ కేటగిరీలలో కంటెంట్ అందిస్తోంది.

ప్రసార భారతి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'వేవ్స్' కేవలం పెద్ద వారికి మాత్రమే కాకుండా.. పిల్లల కోసం కూడా చోటా భీమ్, అక్బర్ బీర్బల్, మ్యూజిక్ షోలు వంటి అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో అయోధ్య నుంచి రామ్ లల్లా హారతి లైవ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వంటి ప్రత్యక్ష లైవ్ ఈవెంట్‌లను కూడా చూడవచ్చు. కొన్ని కార్యక్రమాలకు మినహా ఇతర కార్యక్రమాలకు డబ్బు చెల్లించి ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య