Breaking News

నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ

Published on Mon, 02/16/2026 - 10:59

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడానికి కొందరు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆకర్షణీయంగా ఉండే అబద్ధాలతో రెజ్యూమెలను సృష్టించి కంపెనీలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు ఇటువంటి ఫేక్ అభ్యర్థిని నమ్మి ఉద్యోగం ఇవ్వడం వల్ల తమ కంపెనీ రూ.2 లక్షలకు పైగా నష్టపోయిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాపర్ మీడియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అశుతోష్ గుప్తా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన వివరాలు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

అసలేం జరిగింది?

కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (నేపథ్య తనిఖీ) అనవసరమని భావించినట్లు గుప్తా పేర్కొన్నారు. కేవలం అభ్యర్థి ఇంటర్వ్యూ ప్రదర్శన, గట్ ఫీలింగ్ ఆధారంగా నియామకాలు చేపట్టేవారు. ఈ క్రమంలోనే చిరాగ్ అనే అభ్యర్థి కంపెనీలోకి ప్రవేశించాడు. పాత కంపెనీలో 3 ఏళ్ల అనుభవం, నెలకు రూ.40,000 వేతనం ఉండడంతో ఇంటర్వ్యూలో తన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఈ స్టార్టప్ కంపెనీ రూ.45,000 జీతం ఆఫర్ చేసింది.

నియామకం జరిగిన రెండు నెలల తర్వాత చిరాగ్ పనితీరుపై అనుమానాలు మొదలయ్యాయి. ఒక సాధారణ రియాక్షన్ వీడియో ఎడిటింగ్ టాస్క్ (సాధారణంగా జూనియర్ ఎడిటర్లు రోజుకు మూడు చేస్తారు) పూర్తి చేయడానికి చిరాగ్‌కు రెండు రోజులు పట్టింది. పైగా అతను ఇచ్చిన అవుట్‌పుట్ ఏమాత్రం పనికివచ్చేది కాదు. దీంతో అనుమానం వచ్చిన యాజమాన్యం తన పాత కంపెనీని సంప్రదించింది.

వెలుగు చూసిన నిజాలు

వెరిఫికేషన్ ప్రక్రియలో చిరాగ్ ఆడిన అబద్ధాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. గతంలో అతను నెలకు పొందింది రూ.25 వేలు మాత్రమే, కానీ రూ.40 వేలు అని అబద్ధం చెప్పి 80 శాతం పెంపు పొందాడు. తాను పాత కంపెనీలో రాజీనామా చేయలేదు. పేలవమైన పనితీరు కారణంగా కంపెనీ అతన్ని తొలగించింది. కొత్త కంపెనీలో రిఫరెన్స్ కోసం అతను ఇచ్చిన మేనేజర్ నంబర్ తన స్నేహితుడిది. ఆ స్నేహితుడు మేనేజర్‌లా నటించి చిరాగ్ గురించి మంచి రివ్యూ ఇచ్చాడు.

ఈ ఒక్క తప్పుడు నియామకం వల్ల కంపెనీకి కలిగిన నష్టాన్ని గుప్తా వివరించారు. వేతన రూపంలో మూడు నెలలకు గానూ రూ.1.35 లక్షలు, శిక్షణ ఖర్చుల కింద రూ.40,000, రీప్లేస్‌మెంట్ నియామకం కింద రూ.25,000 నష్టపోయామని చెప్పారు. దీనికంటే ముఖ్యంగా క్లయింట్ ప్రాజెక్టుల జాప్యం, టీమ్ మనోధైర్యం దెబ్బతినడం, నాలుగు నెలల విలువైన సమయం వృథా అయినట్లు తెలిపారు.

స్టార్టప్‌లకు సూచనలు

ఈ చేదు అనుభవం తర్వాత ప్రాపర్ మీడియా ప్రతి నియామకానికి కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థుల మునుపటి కంపెనీ హెచ్‌ఆర్‌కు అధికారిక మెయిల్ చేయడం, లింక్డ్‌ఇన్ ప్రొఫైల్స్ క్రాస్ చెక్ చేయడం, అధికారిక నంబర్ల ద్వారా మాత్రమే ధ్రువీకరించుకోవడం వంటివి తప్పనిసరి చేశారు. తప్పు జరిగిన తర్వాత బాధపడేకంటే, అభ్యర్థిని కంపెనీలోకి తీసుకునే ముందే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇతర స్టార్టప్ వ్యవస్థాపకులకు ఆయన సూచించారు.

ఇదీ చదవండి: ఉఫ్‌.. బిగ్‌ రిలీఫ్‌!

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)