Breaking News

పోస్టాఫీస్‌ స్కీములకు కొత్త విధానం

Published on Fri, 05/02/2025 - 10:47

పోస్టాఫీస్‌ పొదుపు పథకాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. ఈ స్కీములు మారుమూల గ్రామీణులకు సైతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని తెరిచేందుకు అనుసరించే పేపర్‌ వర్క్‌ సామాన్యులకు కాస్త ఇబ్బందిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన పొదుపు పథకాలను తెరవడానికి తపాలా శాఖ ఇప్పుడు పూర్తి డిజిటల్ ప్రక్రియను ప్రవేశపెట్టింది.

మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (ఎంఐఎస్), టైమ్ డిపాజిట్ (టీడీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) వంటి పొదుపు పథకాలను తెరవడానికి పేపర్లతో పనిలేకుండా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణను తపాలా శాఖ అమలుచేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా, వేగంగా ఉంటుంది. ఫిజికల్ డిపాజిట్ స్లిప్ అవసరం ఉండదు.

మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి ప్రసిద్ధ చిన్న పొదుపు పథకాలను తెరవడానికి ఆధార్ ఆధారిత వీ-కేవైసీ ప్రక్రియను ఏప్రిల్ 23 నుండి తపాలా శాఖ అమలు చేస్తోంది. పోస్టాఫీస్‌ పొదుపు ఖాతాలు తెరవడం, నిర్వహించడం కోసం ఆధార్ ఆధారిత ఈ-కేవైసీని ఇదివరకే జనవరి 6 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు డిపాజిట్ వోచర్లు, భౌతిక ఫారాలు నింపే సాంప్రదాయ పద్ధతి కూడా అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు అనువైన విధానాన్ని ఎంచుకోవచ్చు.

ఆధార్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఖాతా మూసివేత, ఖాతా బదిలీలు, నామినేషన్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఈ సేవలు సంప్రదాయ ప్రక్రియలోనే కొనసాగుతాయి. పేపర్‌లెస్‌ కేవైసీ ప్రక్రియను కొత్త కస్టమర్లతోపాటు ఇప్పటికే ఉన్న ఖాతాదారులందరూ వినియోగించుకునేలా చూడాలని అన్ని సర్కిళ్ల సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)