తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు! హింట్‌ ఇచ్చిన కేంద్ర మంత్రి

Published on Sat, 02/24/2024 - 16:02

Petrol and Diesel price : దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు గురించి ఊహాగానాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. దేశంలో 2022 మే 22 నుంచి స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో తగ్గే అవకాశం ఉంది. నాలుగో త్రైమాసికంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు లాభాల్లోకి వస్తే దేశంలో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనప్రాయంగా తెలిపారు.

యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్ నెట్‌వర్క్ ఇండియా (యూఎన్‌జీసీఎన్‌ఐ) 18వ జాతీయ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిమాట్లాడుతూ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గత నష్టాల నుంచి కోలుకున్నాయని, రాబోయే త్రైమాసికంలో లాభాలను చూడవచ్చని పేర్కొన్నారు. "మీరు వారిని (చమురు కంపెనీలను) అడిగితే, వారు తమ లాభం తగ్గిందని చెబుతారు.. కానీ వారు కోలుకున్నారు. నాలుతో త్రైమాసికం బాగుంటే ధరలను తగ్గించవచ్చని ఆశిస్తున్నాను” అని పూరి అన్నారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు త్రైమాసికాల్లో నిలకడగా లాభాలను నమోదు చేశాయి. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనే ఈ కంపెనీలు ఏకంగా రూ.11,773.83 కోట్ల లాభాన్ని నమోదు చేశాయి. గత మూడు త్రైమాసికాల్లో వారి ఉమ్మడి లాభాలు రూ.69,000 కోట్లను అధిగమించాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)