Breaking News

ఒక్క చూపుతో మనసు దోచే పోర్స్చే కొత్త కార్లు - ధర & వివరాలు

Published on Fri, 04/21/2023 - 19:36

దేశీయ విఫణిలో 'పోర్స్చే ఇండియా' ఎట్టకేలకు రెండు లేటెస్ట్ కార్లను విడుదల చేసింది. అవి కయెన్ ఫేస్‌లిఫ్ట్, కయెన్ కూపే ఫేస్‌లిఫ్ట్‌. కంపెనీ విడుదల చేసిన ఈ కార్ల ధరలు, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.

ధరలు:
దేశీయ మార్కెట్లో విడుదలైన పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 1.36 కోట్లు కాగా, కయెన్ కూపే ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ. 1.42 కోట్లు. అయితే డెలివరీలు 2023 జులై నెలలో ప్రారంభమవుతాయి. 

డిజైన్:
ఒక్క చూపుతోనే ఆకర్షించే పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి రిఫ్రెష్డ్ ఫ్రంట్ ఫాసియాతో రీడిజైన్ పొందింది. ఇందులోని హెడ్‌లైట్‌, అల్లాయ్ వీల్స్ వంటివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్‌లను కనెక్ట్ చేసే లైట్‌బార్‌ ఉంటుంది. 

ఇంటీరియర్ ఫీచర్స్:
పోర్స్చే కెయెన్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్‌లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ డిజైన్ చూడవచ్చు. ఇందులో 12.6 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ప్రయాణీకుల కోసం 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఉన్నాయి. అంతే కాకుండా కొత్త స్టీరింగ్ వీల్, డాష్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇంజిన్ & పవర్‌ట్రెయిన్‌:
నిజానికి మార్కెట్లో ప్రస్తుతం కయెన్, కయెన్ కూపే బేస్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్‌తో 353 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

అయితే త్వరలో విడుదలకానున్న ఈ మోడల్ ఈ-హైబ్రిడ్ వేరియంట్స్ అదే ఇంజిన్ కలిగి ఉన్నప్పటికీ e-మోటార్‌తో కలిసి 470 హెచ్‌పి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 25.9kWh బ్యాటరీ 90 కిలోమీటర్ల పరిధిని మాత్రమే అందిస్తుంది. ఇది 11kW ఆన్-బోర్డ్ ఛార్జర్ ద్వారా సుమారు 2.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు.

ప్రత్యర్థులు:
భారతదేశంలో విడుదలైన కొత్త పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మసెరటి లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ8 వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)