Breaking News

థియేటర్లలో పాప్‌కార్న్‌పై జీఎస్‌టీ 5 శాతమే

Published on Wed, 12/25/2024 - 04:46

న్యూఢిల్లీ: థియేటర్లలో లూజుగా విక్రయించే పాప్‌కార్న్‌పై జీఎస్‌టీ అనేది రెస్టారెంట్ల తరహాలో 5 శాతంగానే ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే, సినిమా టికెట్‌తో పాటు కలిపి విక్రయిస్తే మాత్రం నిబంధనల ప్రకారం ఆ కాంబో ప్యాకేజీకి వర్తించే రేటు అమలవుతుందని పేర్కొన్నాయి. జీఎస్‌టీ కౌన్సిల్‌ 55వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు వివరణనిచ్చాయి.

మరోవైపు, సెకండ్‌ హ్యాండ్‌ కార్ల విక్రయానికి సంబంధించిన జీఎస్‌టీపైనా స్పష్టతనిచ్చాయి. విక్రయ విలువ కన్నా తరుగుదల విలువ ఎక్కువ ఉంటే మార్జిన్లపై 18 శాతం జీఎస్‌టీ వర్తించదని, అదే తక్కువగా ఉంటే వర్తిస్తుందని పేర్కొన్నాయి. మధ్యవర్తిత్వ సంస్థలు విక్రయించే పాత వాహనాల విషయంలో మార్జిన్లపై సింగిల్‌ జీఎస్‌టీ రేటు 18 శాతం వర్తింపచేయాలని జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవడంపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)