గోల్డ్‌ లోన్‌ వ్యాపారంలోకి పూనావాలా ఫిన్‌కార్ప్

Published on Wed, 04/16/2025 - 16:48

ముంబై: సైరస్ పూనావాలా గ్రూప్ ప్రమోట్ చేస్తున్న ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్‌ఎల్) కొత్తగా పసిడి రుణాల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. వ్యాపార విస్తరణ, వ్యవసాయ ఖర్చులు, వ్యక్తిగత అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలపై వేగవంతంగా రుణాలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

“మా సెక్యూర్డ్ రుణాల పోర్ట్‌ఫోలియోకు కొనసాగింపుగా పసిడి రుణాలు ఉంటాయి. బంగారానికి గల భావోద్వేగ, ఆర్థికపరమైన విలువను గౌరవిస్తూ, మా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తిని రూపొందించాం” అని పూనావాలా ఫిన్‌కార్ప్ ఎండీ, సీఈవో అరవింద్ కపిల్ తెలిపారు. సెక్యూర్డ్ ఉత్పత్తితో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తన కార్యకలాపాలను పటిష్టం చేసుకునే దిశగా వచ్చే నాలుగు త్రైమాసికాల్లో దశలవారీగా 400 కొత్త శాఖలను ప్రారంభించే యోచనలో పీఎఫ్ఎల్ ఉంది.

సంపద, భద్రతకు విశ్వసనీయమైన వనరుగా భారతీయుల్లో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సత్వరం నిధులు అవసరమైన వారికి ఒక వ్యూహాత్మక ఆస్తిగా ఇది ఉపయోగపడుతోంది. రాబోయే రోజుల్లో ఇటు పట్టణ అటు గ్రామీణ మార్కెట్లలో భారీ వృద్ధి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో గోల్డ్ లోన్ మార్కెట్లో గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక అనిశ్చితుల్లో రుణాలకు తక్కువ రిస్కులతో కూడుకున్న సురక్షితమైన వ్యాపారంగా కూడా పసిడి రుణాల విభాగం కొనసాగుతోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)