Breaking News

ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు

Published on Sun, 02/16/2025 - 06:41

 జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్‌ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫిర్దౌస్‌ అహ్మద్‌ భట్, స్కూల్‌ టీచర్‌ అష్రాఫ్‌ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్‌ అహ్మద్‌ ఖాన్‌ ఉన్నారు. నిసార్‌ అహ్మద్‌ ఖాన్‌ 2000వ సంవత్సరంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్‌ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు తేలింది. 

అదేవిధంగా, 2005లో స్పెషల్‌ పోలీస్‌ అధికారి(ఎస్‌పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్‌గా ప్రమోషన్‌ పొందిన ఫిర్దౌస్‌కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్‌ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్‌ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్‌ భల్వాల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్‌నాగ్‌ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్‌ భట్‌ రెహ్‌బార్‌–ఇ–తలీం టీచర్‌గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్‌ కేంద్రంగా పనిచేసే మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది మహ్మద్‌ కాసిమ్‌ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్‌ చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)