Breaking News

HyperOS: ఈ సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే..

Published on Sat, 01/06/2024 - 19:17

హైపర్‌ ఓఎస్‌ (HyperOS) అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో భారత్‌లోకి తొలి స్మార్ట్‌ఫోన్‌ రాబోతోంది. చైనాకు చెందిన షావోమీ నుంచి వేరుపడిన పోకో (poco) బ్రాండ్‌ దీన్ని లాంచ్‌ చేస్తోంది. పోకో ఎక్స్‌6 ప్రో (Poco X6 Pro) షావోమీ ఆండ్రాయిడ్‌ 14తో కూడిన హైపర్‌ ఓఎస్‌ సాఫ్ట్‌వేర్‌తో వస్తోంది.

పోకో తన ఎక్స్‌ సిరీస్‌ను రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్‌6, పోకో ఎక్స్‌6 ప్రో మోడల్‌లు వచ్చే వారంలో భారత్‌లో అధికారికంగా లాంచ్ అవుతున్నాయి. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన కొన్ని స్పెక్స్‌లను కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. అయితే, కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీతో కూడిన ఎక్స్‌6 సిరీస్‌కు సంబంధించిన ఇతర కీలక ఫీచర్లను కంపెనీ ఇంకా ఆవిష్కరించలేదు. 

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోకో షేర్‌ చేసిన తాజా పోస్ట్ ప్రకారం.. పోకో ఎక్స్‌6 ప్రో ప్రపంచవ్యాప్తంగా జనవరి 11న సాయంత్రం 5.30 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్‌ అవుతోంది. అత్యధిక ఫర్మార్మెన్స్‌ను జోడించిన సరికొత్త షావోమీ హైపర్‌ఓఎస్‌తో ఇది వస్తోంది. అయితే వెనిలా పోకో ఎక్స్‌6 మోడల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MIUIతో వస్తుందని భావిస్తున్నారు.

పోకో ఎక్స్‌6 సిరీస్ స్పెసిఫికేషన్లు ఇవే..
పోకో ఎక్స్‌6 ప్రో సరికొత్త MediaTek డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్‌సెట్‌తో వస్తుందని కంపెనీ ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు వనిల్లా పోకో ఎక్స్‌6 మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoCని కలిగి ఉంటుంది. ఇక ఈ సిరీస్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లను ఫ్లిప్‌కార్ట్‌ లిస్ట్‌ చేసింది. వాటిలో WildBoost 2.0 గేమింగ్ ఆప్టిమైజేషన్, హీట్ మేనేజ్‌మెంట్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్ 5000mm2 ఆవిరి చాంబర్‌ ఉన్నాయి.

ఇక ప్రో వేరియంట్ 12GB ర్యామ్‌ 512GB ఇన్‌బిల్ట్‌ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఇవి కాకుండా పోకో ఎక్స్‌6 సిరీస్ మోడల్‌లు 120Hz డిస్‌ప్లేతో వస్తున్నాయని రూమర్స్‌ వచ్చాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 64MP మెయిన్‌ కెమెరా, 67 వాట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు సపోర్ట్‌ చేసే అవకాశం ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)