Breaking News

విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గింపు

Published on Wed, 06/04/2025 - 10:17

విద్యాలక్ష్మి స్కీము కింద విద్యా రుణాలపై వడ్డీ రేటును 20 బేసిస్‌ పాయింట్లు (0.2%) తగ్గించినట్లు  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వెల్లడించింది. సంస్థను బట్టి విద్యా రుణాలపై వడ్డీ రేటు 7.5% నుంచి ప్రారంభం అవుతుందని వివరించింది. ఉన్నత విద్యను అభ్యసించడంలో విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటునందించే లక్ష్యంతో ఈ స్కీమును రూపొందించారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలుగా (క్యూహెచ్‌ఈఐ) గుర్తింపు పొందిన 860 సంస్థల్లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటోంది.

ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్‌ బిల్లు-2025 ముసాయిదా విడుదల

విద్యాలక్ష్మి పథకం కింద ఎడ్యుకేషన్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేయాలంటే కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

కేవైసీ వివరాల కోసం: ఆధార్, పాన్ ఐడీ, అడ్రస్ ప్రూఫ్.

అకడమిక్ రికార్డులు: మునుపటి అకడమిక్‌ ఏడాదిలోని మార్కు షీట్‌లను సెల్ఫ్‌ అటెస్టెడ్‌ చేయాలి.

ప్రవేశ పరీక్ష ఫలితాలు: ఇప్పటికే ఏదైనా యూనివర్సిటీలో ప్రవేశం కోసం చూస్తూ, దాని ప్రవేశ పరీక్ష రాసి ఉంటే అందుకు సంబంధించిన ర్యాంక్‌ కార్డును జోడించాలి.

అడ్మిషన్ ప్రూఫ్: ఇప్పటికే సంస్థ నుంచి అడ్మిషన్‌ వస్తే ఫీజు స్ట్రక్చర్‌తో పాటు సంస్థ నుంచి అడ్మిషన్‌ లెటర్.

ఫొటోలు: పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.

లోన్ హిస్టరీ: ఇప్పటికే బ్యాంకులు/ రుణదాతల నుంచి గతంలో లేదా ప్రస్తుతం ఉన్న రుణాల వివరాలు.

ఆదాయ ధ్రువీకరణ పత్రం: రాష్ట్రంలోని నిర్దేశిత పబ్లిక్ అథారిటీ నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)