తెలంగాణకు విద్యుత్‌.. ఎన్‌టీపీసీ నోఖ్రా ప్రాజెక్ట్‌ నేడు జాతికి అంకితం

Published on Fri, 02/16/2024 - 10:07

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో ఎన్‌టీపీసీకి చెందిన 300 మెగావాట్ల నోఖ్రా సోలార్‌ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫిబ్రవరి 16న జాతికి అంకితం చేస్తున్నారు. బికనీర్‌ జిల్లాలో 1,550 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు విస్తరించింది.

పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించడానికి రూ.1,803 కోట్ల పెట్టుబడితో సీపీఎస్‌యూ పథకం (ఫేజ్‌– ఐఐ) కింద ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 13 లక్షల పైచిలుకు సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ వినియోగించారు. ప్రాజెక్టు పూర్తి అయితే ఏటా 730 మిలియన్‌ యూనిట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని ఎన్‌టీపీసీ వెల్లడించింది.

ఈ ప్రాజెక్ట్‌ 1.3 లక్షలకుపైగా గృహాల్లో వెలుగులు నింపుతుందని వివరించింది. అలాగే ఏటా 6 లక్షల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని తెలిపింది. ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులతో 3.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. 26 గిగావాట్ల సామర్థ్యం గల వివిధ ప్రాజెక్టులు పలు నిర్మాణ దశల్లో ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)