Breaking News

Factcheck ఈ స్పెషల్‌ స్కీం కింద ప్రతీ ఆడబిడ్డకూ 1.80 లక్షలు? నిజమా?

Published on Mon, 03/13/2023 - 15:51

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రభుత్వం ప్రతి ఆడపిల్లకు రూ.1.80 లక్షలు ఇస్తోందంటే ఇటీవల ఒక వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కూడా ఈ వార్తను హైలైట్‌ చేశాయి. అయితే ఇందులో నిజం లేదని  పీఐబీ తేల్చి  చెప్పింది.  (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ)

వివరాలను పరిశీలిస్తే..
సోషల్‌ మీడియాలో పుకార్లు,నకిలీ వార్తలకు కొదవే ఉండదు. ఇదిగో తోక ..అంటే  అదిగో పులి అంటూ నకిలీ గాళ్లు చెలరేగిపోతారు. తాజాగా అమ్మాయిలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆడబిడ్డకూ లక్షా, 80వేల రూపాయలు అందిస్తోందని, ఈ మొత్తాన్ని బాలిక తల్లిదండ్రుల ఖాతాలో జమ కానుందంటూ  ఒక మెసేజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో స్పందించిన ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ,  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఈ మెసేజ్‌పై నిజనిర్ధారణచేసి ట్విటర్‌ ద్వారా వివరణ ఇచ్చింది.  (మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌: కొత్త ఆప్షన్స్‌తో పండగే!)

పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌
ఈ వార్త, వీడియో నకిలీవని, దీనికి ఎలాంటి ప్రామాణికత లేదని పీఐబీ అధికారిక ట్విటర్‌ ఖాతా తేల్చి చెప్పింది.  అసలు ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద యోజన అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదని కాబట్టి, ఈ పథకం ద్వారా ఆడపిల్లలకు ఎలాంటి సహకారం అందించే ప్రశ్నే లేదని పేర్కొంది. ఇలాంటి ఫేక్‌ మెసేజ్‌ల వలలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించింది. (ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ వచ్చేసింది! భారీ డిస్కౌంట్‌ కూడా)

కాగా ప్రభుత్వ జ్ఞాన్ అనే యూట్యూబ్‌ చానెల్‌ ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన కింద ప్రతీ అమ్మాయికి తల్లిదండ్రులకు కేంద్రం రూ.180,000అందజేస్తుందని ఒక వీడియోలో  పేర్కొనడం, అది వైరల్‌ కావడం తెలిసిందే.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)