Breaking News

ఆర్థిక సేవల చేరువలో ‘జన్‌ధన్‌’ విప్లవం

Published on Tue, 08/29/2023 - 04:30

న్యూఢిల్లీ: జన్‌ధన్‌ యోజన ఆధారిత చర్యలు, డిజిటల్‌ పరివర్తన దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయంలో విప్లవాత్మకంగా పనిచేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. జన్‌ధన్‌ యోజన పథకం కింద 50 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి తీసుకొచ్చామని, ఈ ఖాతాల్లో డిపాజిట్లు రూ.2 లక్షల కోట్లను మించాయని మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) పథకం తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక సమ్మేళన చర్యల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో 55.5 శాతం మహిళలు ప్రారంభించినవేనని, 67 శాతం గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో తెరుచుకున్నవేనని వెల్లడించారు. ఈ పథకం కింద 2015 మార్చి నాటికి 14.72 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు ఉంటే, 2023 ఆగస్ట్‌ 16 నాటికి 50.09 కోట్లకు పెరిగాయి.

ఇదే కాలంలో డిపాజిట్లు రూ.15,670 కోట్ల నుంచి రూ.2.03 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. ఈ ఖాతాలకు సంబంధించి 34 కోట్ల రూపే కార్డులను కూడా బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ కార్డుపై రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా సైతం లభిస్తుంది. ఈ ఖాతాల్లో కనీస బ్యాలన్స్‌ ఉంచాల్సిన అవసరం కూడా లేదు.

‘‘భాగస్వాములు, బ్యాంక్‌లు, బీమా కంపెనీలు, ప్రభుత్వ అధికారుల సంయుక్త కృషితో పీఎంజేడీవై కీలక చొరవగా పనిచేసి, దేశంలో ఆర్థిక సేవల విస్తరణ ముఖచిత్రాన్ని మార్చేసింది’’అని మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాడ్‌ మాట్లాడుతూ.. జన్‌ధన్‌–ఆధార్‌–మొబైల్‌ ఆర్కిటెక్చర్‌తో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారులకు బదిలీ చేయగలుగుతున్నట్టు చెప్పారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)