ఈ–టూవీలర్లకు ‘పీఎం’ స్కీము పొడిగింపు

Published on Wed, 08/12/2026 - 00:14

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ’పీఎం ఈ–డ్రైవ్‌’ స్కీము గడువును 2028 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. అయితే, దీనిపై ఇచ్చే సబ్సిడీని రూ. 5,000 నుంచి (కిలోవాట్‌హవర్‌కి – కేడబ్ల్యూహెచ్‌) సగానికి రూ. 2,500కి తగ్గించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం 2025 ఏప్రిల్‌ 1 నుంచి 2028 మార్చి 31 వరకు  రిజిస్టర్‌ అయ్యే ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు ప్రతి కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యానికి రూ. 2,500 మేర సబ్సిడీ పొందవచ్చు. ఒక్కో వాహనంపై సబ్సిడీ గరిష్టంగా రూ. 5,000 ఉంటుంది.

గతంలో, అంటే, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ ప్రతి కేడబ్ల్యూహెచ్‌కి రూ. 5,000గాను, గరిష్ట పరిమితి రూ. 10,000గాను ఉంది. తాజా ప్రోత్సాహకాన్ని పొందాలంటే ఈ–టూవీలర్‌ ఎక్స్‌–ఫ్యాక్టరీ రేటు గరిష్ట పరిమితి రూ. 1.5 లక్షలుగా ఉంటుంది. ఈ స్కీము తాజా విడత కోసం కేంద్రం రూ. 2,767 కోట్లు కేటాయించింది. 2024 ఏప్రిల్‌ 1 నుంచి 2028 మార్చి 31 వరకు అమలయ్యే పీఎం ఈ–డ్రైవ్‌ పథకానికి మొత్తం రూ. 11,900 కోట్లు వెచ్చిస్తోంది.  

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)