వందల కోట్లు వదిలి.. సన్యాసిగా మారిన బిలియనీర్!

Published on Mon, 07/17/2023 - 14:07

Billionaire to Monk: సాధారణంగా ఎవరైనా కడు పేదరికం నుంచి సంపన్న జీవితం గడపాలని కలలు కంటారు. సంపన్న జీవితం వదిలి సన్యాసిగా బతకాలని మాత్రం ఎవరూ అనుకోరు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే వారిని వేళ్ళమీద లెక్కపెట్టేయొచ్చు. 'భన్వర్‌లాల్ రఘునాథ్ దోషి' (Bhanwarlal Raghunath Doshi) ఈ కోవలోకే వస్తాడు. ఆయన గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, రాజస్థాన్‌లో చిన్న వస్త్ర వ్యాపారి అయిన తన తండ్రి నుంచి రూ.30,000 తీసుకుని ప్లాస్టిక్ వ్యాపారం ప్రారంభించాడు భన్వర్‌లాల్‌. కొన్ని సంవత్సరాలలోనే వ్యాపారంలో గణనీయమైన వృద్ధి సాధిస్తూ ఢిల్లీ కింగ్‌గా పేరుతెచ్చుకున్నాడు. క్రమంగా ఎంతో నేర్పుతో తన వ్యాపారాన్ని రూ. 600 కోట్లకు విస్తరించాడు.

(ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్‌ రంగాన్నే షేక్‌ చేసిన ఇండియన్‌!)

జైన మతాన్ని స్వీకరించాలని, మత బోధకుడిగా మారాలనే కోరికతో కోట్ల సామ్రాజ్యం త్యజించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నిర్ణయం తెలిసి ఎంతో మంది ఆశ్చర్యపోయారు. అనుకున్న విధంగానే అహ్మదాబాద్‌లో జరిగిన భారీ వేడుకలో, లక్షలాది మంది ప్రజల సమక్షంలో దోషి జైన్ ఆచార్య శ్రీ గుణరత్న సురిష్వరాజ్ జీ మహారాజ్ నుంచి శిష్యరికం పొందాడు. ఈ వేడుకకు హాజరైన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ దోషిని సత్కరించారు.

(ఇదీ చదవండి: బైక్‌కు గుడి కట్టించి పూజలు - సినిమాను తలపించే ఇంట్రెస్టింగ్ స్టోరీ!)

ఎప్పటినుంచో సన్యాసి కావాలని అనుకుంటున్న దోషి.. కుటుంబం, వ్యాపార లావాదేవీల వల్ల 1982లో తన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేశాడు. అనుకున్నది సాధించిన తర్వాత జైన మతం స్వీకరించారు. ఈ వేడుక 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో వైభవంగా జరిగింది. మొత్తానికి కోట్లు వదులుకుని జైన మతాన్ని స్వీకరించి ఎంతోమందికి ఆదర్శనీయుడయ్యాడు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)