Breaking News

విదేశీ పెట్టుబడులకు పుష్‌ 

Published on Sun, 11/23/2025 - 04:14

న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లు, విదేశీ సంస్థాగత పెట్టుబడు(ఎఫ్‌ఐఐ)లను ఆకట్టుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఇందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళతర, సమర్థవంత వేగంతోకూడిన విధానాలకు తెరతీయనున్నారు. 

ఈ బాటలో ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ విధానాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది. తద్వారా దేశంలోకి మరింత వేగంగా పటిష్టస్థాయిలో పెట్టుబడులు ప్రవహించేలా గోయల్‌ చర్యలు చేపట్టనున్నారు. సమావేశానికిముందు పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 98వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులనుద్ధేశించి గోయల్‌ ప్రసంగించారు. 

దేశంలోకి మరింత వేగంగా విదేశీ పెట్టుబడులు ప్రవహించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు గోయల్‌ తెలియజేశారు. ఉద్యోగ కల్పన, కొత్త టెక్నాలజీలు, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు విదేశీ పెట్టుబడులు దారి చూపుతాయని ఈ సందర్భంగా గోయల్‌ పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశీ కరెన్సీకి స్థిరత్వాన్ని కలి్పంచవచ్చని తెలియజేశారు. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు.  

క్యూ1లో 15 శాతం అప్‌ 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో దేశంలోకి 15 శాతం అధికంగా ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో 18.62 బిలియన్‌ డాలర్లను తాకాయి. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబడులు 50 బిలియన్‌ డాలర్లను అధిగమించగా.. ఎఫ్‌డీఐలు 80.6 బిలియన్‌ డాలర్లను తాకడం గమనార్హం! పారిశ్రామికంగా సరఫరా వ్యవస్థలు డైవర్సిఫైకావలసి ఉన్నట్లు గోయల్‌ ప్రస్తావించారు. దీంతో ఒకే ప్రాంతంపై ఆధారపడటం తగ్గుతుందని తెలియజేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)