Breaking News

అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు

Published on Thu, 02/19/2026 - 08:09

అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్‌ కోల్‌ దిగుమతి పట్ల ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. చమురు, బొగ్గు కొనుగోలును భారత్‌ మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు. వీటి కోసం రెండు మూడు భౌగోళిక ప్రాంతాలపైనే ఆధారపడి ఉన్నట్టు, దీని కారణంగా ధరల్లో అస్థిరతలు ఉంటున్నట్టు పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధికి అవసరమైన వస్తువులు కొన్నింటిని అమెరికా అందించగలదన్నారు.

ఏఐ అప్లికేషన్లకు గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (జీపీయూలు), డేటా సెంటర్ల ఎక్విప్‌మెంట్, అత్యధిక పనితీరుతో కూడిన కంప్యూటింగ్‌ అవసరాన్ని ప్రస్తావించారు. అమెరికా పోటీ పడలేని ఉత్పత్తులను భారత్‌ తయారు చేయగలదని, పెట్టుబడులు, టెక్నాలజీ వనరుల పరంగా అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్‌ మాట్లాడారు.

వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 100 బిలియన్‌ డాలర్ల విమానాలకు ఇప్పటికే డిమాండ్‌ ఉందని.. స్థానిక సామర్థ్యాలను మరింత పెంచాల్సి ఉందని చెప్పారు. ఇటీవలే భారత్‌–అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదరడం తెలిసిందే. దీని కింద వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్‌ డాలర్ల వస్తువులను భారత్‌ కొనుగోలు చేయనుంది. వచ్చే వారంలో భారత బృందం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. ఒప్పందానికి సంబంధించి తుది పత్రాలను ఖరారు చేయనుంది. దీనిపై మార్చిలో ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అమెరికాతో ఒప్పందం వల్ల భారత సంస్థలకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నట్టు మంత్రి గోయల్‌ చెప్పారు. ముఖ్యంగా కారి్మక ఆధారిత రంగాలు, టెక్నాలజీ సేవలకు డిమాండ్‌ ఉంటుందన్నారు.

ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్‌ పవర్‌!

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)