Breaking News

బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..త్వరలోనే ఆర్​బీఐ కీలక నిర్ణయం?!

Published on Tue, 02/20/2024 - 13:01

దేశంలో వెహికల్ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ చెల్లింపు దారులకు ఆర్‌బీఐ శుభవార్త చెప్పనుందా? అంటే అవుననే అంటున్నారు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్.

ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన 19 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చెందిన 35 మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ గణనీయమైన వృద్ధి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే తదితర అంశాలపై మాట్లాడారు. దేశం ఆర్ధికంగా బలంగా ఉందని, పదేళ్ల సగటు ద్రవ్యోల్బణం దాదాపు 5 నుంచి 5.5 శాతం ఉందని చెప్పారు. కాబట్టే త్వరలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

గత ఏడాదిన్నర కాలంలో ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత వడ్డీ రేట్లు మళ్లీ 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్భణం చాలా వరకు నియంత్రణలో ఉంది. త్వరలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్షలో బ్యాంకుల నుంచి వసూలు చేస్తే వడ్డీ రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని అన్నారు. అదే జరిగితే బ్యాంకుల నుంచి కస్టమర్ల తీసుకునే లోన్లపై విధించే వడ్డీ రేట్లు అదుపులోకి వస్తాయి. ఈఎంఐల భారం తగ్గుంది.

వడ్డీ రేట్లను తగ్గిస్తే
సెంట్రల్ బ్యాంక్ .. దేశంలో పలు బ్యాంకులకు లోన్లు ఇస్తుంటుంది. బ్యాంకులు తీసుకునే ఆ రుణాలపై ఆర్‌బీఐ కొంత మొత్తంలో వడ్డీని వసూలు చేస్తుంటుంది. అయితే, ఈ ఇంట్రస్ట్ రేటు ఎక్కువగా ఉంటే.. సదరు బ్యాంకుల్లో తీసుకునే కస్టమర్లకు తీసుకునే లోన్ పై చెల్లింపులు అధికంగా ఉంటాయి. అదే ఇంట్రస్ట్ రేటు తక్కువగా ఉంటే ఆయా లోన్లపై విధించే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటుంది. 

అయితే, ఎప్పటిలాగే గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులు ఇచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ 6.5 శాతం వడ్డీని విధించింది. ఆ మొత్తం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా వడ్డీ చెల్లింపులు వడ్డీలను కొనసాగిస్తూ వస్తుంది. ఫలితంగా ఆయా బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై అధిక మొత్తంలో వడ్డీని వసూలు చేస్తున్నాయి. పియూష్ గోయల్ చెప్పినట్లు ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే ఈఎంఐల భారం తగ్గనుంది. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)