Breaking News

త్వరలో పసిడి రుణాల్లోకి పిరమల్‌ ఫైనాన్స్‌

Published on Fri, 11/28/2025 - 07:39

2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1.5 లక్షల కోట్ల ఏయూఎంని (నిర్వహణలోని అసెట్స్‌) లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పిరమల్‌ ఫైనాన్స్‌ రిటైల్‌ లెండింగ్‌ సీఈవో జగదీప్‌ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రిటైల్‌ ఏయూఎం రూ. 75,000 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇది సుమారు రూ. 8,300 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.

తమ వ్యాపారంలో సుమారు 11–12 శాతం వాటా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింత దృష్టి పెడుతున్నామని ఆయన పేర్కొ న్నారు. ప్రధాన నగరాల్లో 59 శాఖలు ఉన్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50–75 శాఖలు ప్రారంభించనున్నామని, వీటిలో కొన్ని ఇక్కడ కూడా ఉంటాయని జగదీప్‌ పేర్కొన్నారు.

ప్రస్తుత గృహ, ఎస్‌ఎంఈ, వ్యక్తిగత, వాహన రుణాలందిస్తున్న తమ సంస్థ త్వరలో పసిడి రుణాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్‌లో సెమీ అర్బన్‌ మార్కెట్లలో డిమాండ్‌ నెలకొనడంతో రిటైల్‌ రుణాల మంజూరు 45 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు