Breaking News

ఫోన్‌పే రూ.696 క్యాష్‌ బ్యాక్.. నిజమేనా?

Published on Sun, 03/30/2025 - 11:34

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పేకి సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్‌ ప్రమోషన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫోన్‌పే రూ.696 క్యాష్‌ బ్యాక్ ఆఫర్ చేస్తోందంటూ పలువురు సోషల్ మీడియా యూజర్లు ఓ పోస్ట్ పెట్టారు. అయితే దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆ పోస్టు ఫేక్ అని, ఫోన్‌పే అలాంటి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఏదీ ప్రకటించలేదని తేలింది.

అసలేముంది ఆ పోస్ట్‌లో?
ఈ ఐపీఎల్ సీజన్లో ఫోన్‌పే రూ.696 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోందని 'ఐపీఎల్-హబ్' అనే ఫేస్‌బుక్ యూజర్ మార్చి 22న పోస్ట్ చేశారు. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడానికి యూజర్ల కోసం రిజిస్ట్రేషన్ లింక్‌ను కూడా పోస్ట్‌లో పొందుపరిచారు. హిందీలో రాసిన ఈ పోస్టు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. నిజమేనేమోనని చాలా మంది యూజర్లు దీన్ని షేర్‌ చేస్తుండటంతో వైరల్‌గా మారింది.

మరి ఏం తేలింది?
ఇన్‌విడ్ అనే టూల్ ద్వారా ఈ వైరల్ పోస్ట్‌ను పరీక్షించగా ఇలాంటివే మరికొన్ని ఫేక్‌ పోస్టులు కనిపించాయి.  ఫోన్‌పే అటువంటి క్యాష్‌బ్యాక్ పథకాన్ని  ఏమైనా ప్రారంభించిందా అని తదుపరి ధ్రువీకరణ కోసం ఫోన్‌పేకు సంబంధించిన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను పరిశీలించినా అటువంటి ఆఫర్‌ ఏదీ కనిపించలేదు. ఈ పక్రియలో ఫోన్‌పే అధికారిక వెబ్‌సైట్లో ఒక బ్లాగ్ కనిపించింది. క్యాష్‌బ్యాక్ మోసాల నుండి అప్రమత్తంగా ఉండండి" అంటూ పేర్కొంది. ఫోన్ కాల్స్ లేదా లింక్‌ల ద్వారా ఫోన్‌పే క్యాష్ బ్యాక్‌లు, రివార్డులను అందించదని అందులో వివరించింది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)