Breaking News

'ఏఏ' వ్యాపారానికి ఫోన్‌పే గుడ్‌బై.. లైసెన్స్‌ వెనక్కి..

Published on Sat, 02/08/2025 - 07:33

ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ ఫోన్‌పే (PhonePe) అకౌంట్‌ అగ్రిగేషన్‌ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీ–ఏఏ లైసెన్స్‌ను (license) ఆర్‌బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్‌ అగ్రిగేషన్‌ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.

తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్‌ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్‌ కింద అనుమతి ఉంటుంది.  2023 జూన్‌లో ఫోన్‌పేకు ఎన్‌బీఎఫ్‌సీ–ఏఏ లైసెన్స్‌ రావడం గమనార్హం.  

‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్‌ఫామ్‌పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రొవైడర్లను మా ప్లాట్‌ఫామ్‌ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్‌పే గ్రూప్‌ అకౌంట్‌ అగ్రిగేషన్‌ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్‌పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు