Breaking News

ఉద్యోగులను తొలగించలేదు: ఫోన్‌పే

Published on Tue, 10/22/2024 - 12:04

ఆన్‌లైన్‌ పేమెంట్‌ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ను తొలగించినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని పేర్కొంది. అయితే కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలోని ఉద్యోగులు తగ్గిపోవడానికి కారణాన్ని తెలియజేసింది.

ఫోన్‌పే తన కస్టమర్‌ సపోర్ట్‌ స్టాఫ్‌ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించినట్లు పలు మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు తగ్గించినట్లు తెలిపాయి. దీనిపై కంపెనీ తాజాగా స్పందించింది. ‘ఏఐ, ఆటోమేషన్ వల్ల కంపెనీలో ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో కస్టమర్‌ సపోర్ట్‌ విభాగంలో ఏఐను వాడుతున్నాం. అదే సమయంలో కొత్తగా ఆ విభాగంలో స్టాఫ్‌ను నియమించలేదు. అలాగని ఉన్నవారిని బలవంతంగా తొలగించలేదు. ఐదేళ్ల కిందట ఈ విభాగంలో ఉన్న సిబ్బంది వివిధ కారణాలతో ఉద్యోగం మానేశారు. అయితే కొత్త స్టాఫ్‌ను నియమించకపోవడం వల్ల వీరి సంఖ్య తగ్గినట్లు కనిపింది’ అని ఫోన్‌పే ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..

ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో కొత్తగా కొలువులు స​ృష్టించే అవకాశం ఉండడం లేదు. ఏఐ వల్ల ఈ విభాగంలో పని చేస్తున్నవారు ఇతర రంగాలకు మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్‌ సెక్టార్‌లో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

Videos

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగా DSCలో అక్రమాలను కప్పిపుచ్చలేక అధికారుల తంటాలు

ఆక్వా రైతులకు మరోసారి బిగ్ షాక్

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావ్ లోకేష్ ఇక నీ చాప్టర్ క్లోజ్..

అన్నాచెల్లెళ్ల టీచర్ జాబ్.. బయటపడ్డ నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

Photos

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)