Breaking News

యూపీఐ లావాదేవీల్లో గుత్తాధిపత్యం! 

Published on Fri, 10/31/2025 - 05:56

న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీల్లో 80 శాతాన్ని కేవ లం 2 సంస్థలు (ఫోన్‌పే, జీపే) నియంత్రిస్తున్నాయంటూ.. ఈ ఏకాగ్రత రిస్క్‌ను తగ్గించేందుకు చ ర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ, ఆర్‌బీఐని ఇండి యా ఫిన్‌టెక్‌ ఫౌండేషన్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) కోరింది. ఫిన్‌ టెక్‌ పరిశ్రమకు స్వీయ నియంత్రణ మండలిగా వ్య వహరిస్తున్న ఐఎఫ్‌ఎఫ్‌.. ఇందుకు సంబంధించి వి ధాపరమైన సూచనలు చేసింది. ఐఎఫ్‌ఎఫ్‌లో భాగమైన ఫిన్‌టెక్‌ సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల అనంతరం వీటిని రూపొందించినట్టు తెలిపింది. 
 
→ యూపీఐపై 30 థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌ ప్రొవైడర్లు (టీపీఏపీలు) ఉండగా.. 80 శాతానికిపైగా లావాదేవీలు రెండు సంస్థల నియంత్రణల్లోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు దోపిడీ ధరలతో (భారీ తగ్గింపులు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు)తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటాయి. ముఖ్యంగా చిన్న సంస్థలు, దేశీ పోటీదారులను పోటీపడకుండా చేస్తాయి. 

→ ప్రభుత్వానికి చెందిన భీమ్‌ ప్లాట్‌ఫామ్‌ సైతం ఈ ద్వందాధిపత్యం దెబ్బకు మార్కెట్‌ వాటాను కోల్పోయింది.  

→ యూపీఐ లావాదేవీలను నగదుగా మార్చుకునే అవకాశం (ఎండీఆర్‌ చార్జీలు) లేకపోవడం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలకు ఉన్న నిధుల వెసులుబాటు.. కొత్త సంస్థలు, చిన్న సంస్థల ప్రవేశానికి గట్టి అవరోధంగా నిలుస్తాయి. పోటీని అణచివేస్తాయి.  

→ ఒక సంస్థ గరిష్టంగా 30 శాతం లావాదేవీలకే సేవలు అందించాలన్న పరిమితిని అమలు చేయడంలో ఎన్‌పీసీఐ జాప్యం చేస్తుండడం నిర్వహణపరమైన సవాళ్లను, ఏకాగ్రత రిస్‌్కను తెలియజేస్తుంది. ఎన్‌పీసీఐ ఈ పరిమితి అమలు చేయడానికి ముందుగానే ఈ సంస్థలు మరింత పెద్దవిగా అవతరించేందుకు అనుమతించడం.. వ్యూహాత్మకమే అనిపిస్తోంది.  

→ ఈ ఏకాగ్రత రిస్‌్కను తగ్గించేందుకు బడా రెండు యూపీఐ సంస్థలు (టీపీఏపీలు) కాకుండా మిగిలిన వాటికి యూపీఐ ప్రోత్సాహకాల్లో అధిక వాటా అందుకునేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సదరు రెండు అతిపెద్ద టీపీఏపీలు ప్రోత్సాహకాల్లో అధిక భాగాన్ని పొందుతాయి. ఒక టీపీఏపీకి ప్రోత్సాహకాల్లో 10 శాతం గరిష్ట పరిమితి విధించాలి.   
 
 

Videos

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు