Breaking News

అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు

Published on Sun, 10/20/2024 - 09:43

దసరా, దీపావళి వస్తున్నాయంటే.. ఉద్యోగులకు సంబరపడిపోతుంటారు. ఎందుకంటే తాము పనిచేస్తున్న కంపెనీలు బోనస్‌లు లేదా గిఫ్ట్స్ వంటివి ఇస్తాయని. కొన్ని కంపెనీలు బోనస్ ఇచ్చి సరిపెట్టుకుంటే.. మరికొన్ని కంపెనీలు ఏకంగా ఊహకందని గిఫ్ట్స్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

ఇటీవల హర్యానాలోని పంచకులలోని ఫార్మాస్యూటికల్ కంపెనీ 15 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచింది. పంచకుల పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ సంస్థలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందికి 13 టాటా పంచ్ వాహనాలు, రెండు మారుతి గ్రాండ్ విటారా కార్లను గిఫ్ట్ ఇచ్చింది.

కంపెనీ యజమాని ఎంకే భాటియా స్వయంగా కార్ల తాళాలు ఉద్యోగులకు అందజేశారు. ఉద్యోగులు ఎంతో అంకితభావంతో పని చేశారని కొనియాడారు. ఉత్తమ పనితీరు కనపరిచిన అందరూ నాకు సెలబ్రిటీల వంటివారని, కంపెనీ విజయానికి వారి సహకారం చాలా ప్రశంసనీయమని భాటియా అన్నారు.

ఇదీ చదవండి: ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా

ఎంకే భాటియా తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా 12 మంది ఉద్యోగులకు కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఏటా 15 మందికి కార్లను బహూకరించారు. ఇప్పటికి కంపెనీ మొత్తం 27 కార్లను ఉద్యోగులకు అందించింది. ఈ పద్దతిని మిట్‌స్కైండ్ హెల్త్‌కేర్ భవిష్యత్తులో కొనసాగించాలని యోచిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)