Breaking News

E20 పెట్రోల్ సేఫేనా?.. 87 వేల పెట్రోల్ బంకుల్లో తనిఖీలు!

Published on Tue, 08/04/2026 - 18:51

ఇథనాల్ కలిపిన పెట్రోల్ నాణ్యత, కల్తీ అయ్యే అవకాశంపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చర్చ మొదలైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధనంలో కల్తీ లేదా నాణ్యత లోపాలు ఉన్నాయన్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశవ్యాప్తంగా కఠినమైన నాణ్యత నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ప్రజలకు అందించే పెట్రోల్ నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామని, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి దశలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. సాధారణ తనిఖీలతో పాటు.. ఎలాంటి కల్తీ జరగకుండా అదనపు పరీక్షలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఉన్న 87 వేలకు పైగా పెట్రోల్ బంకుల్లో.. రోజుకు 8 నుంచి 12 సార్లు నీటి కలయిక ఉందా.. లేదా?, అనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా.. పెట్రోల్‌లో కలుషితాలు ఉన్నాయా?, లేదా? అని తెలుసుకోవడానికి 2 వేలకు పైగా ఇంధన నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేవలం రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్ కలుషిత సమస్యలు బయటపడగా, వెంటనే ఆ పెట్రోల్ బంకుల్లో విక్రయాలను నిలిపివేసినట్లు కూడా కేంద్రం వెల్లడించింది.

తనిఖీలు ఇలా..
ఈ20 పెట్రోల్ నాణ్యత అనేది వాహనం ట్యాంక్‌కు చేరిన తర్వాత మాత్రమే పరిశీలించేది కాదని కేంద్రం తెలిపింది. ఇథనాల్ తయారీ దశ నుంచే నాణ్యత తనిఖీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.

ముందు ఇథనాల్ నాణ్యతను పరిశీలిస్తారు. డిస్టిలరీల నుంచి వచ్చే ప్రతి బ్యాచ్ ఎథనాల్ BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దాని స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండటం తప్పనిసరి. ఇథనాల్‌ను ఆయిల్ కంపెనీల డిపోలకు పంపే సమయంలో నాణ్యత ధ్రువీకరణ పత్రం కూడా అందజేస్తారు.

నాణ్యత ప్రమాణాలు పాటించని ఇథనాల్‌ను.. సరఫరా వ్యవస్థలోకి అనుమతించడం లేదని ప్రభుత్వం తెలిపింది. 2024 జూలై నుంచి 2026 జూన్ మధ్య కాలంలో 302 ట్యాంకర్లలో వచ్చిన దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్‌ను ప్రమాణాలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. ఇందులో స్వచ్ఛత, నీటి శాతం, సాంద్రత వంటి అంశాల్లో లోపాలను గుర్తించారు.

ఇథనాల్ నిల్వ, రవాణా సమయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర పదార్థాలతో కలవకుండా.. ప్రత్యేక నిల్వ కేంద్రాల్లో ఉంచుతున్నారు. డిపోలకు చేరిన ప్రతి ట్యాంకర్ నుంచి పైభాగం, కింది భాగం నుంచి నమూనాలు తీసుకుని పరీక్షించిన తర్వాతే ఆమోదిస్తున్నారు.

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)