Breaking News

ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాలు తగ్గవు..!

Published on Tue, 12/12/2023 - 05:02

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై పన్నుల్లో కోత విధించే అవకాశం లేదని ఆర్థికశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు ఇప్పటికే తగ్గాయని, ఈ నేపథ్యంలో  ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించే పరిస్థితి లేదని  చెప్పారు. భారత్‌ తన చమురు అవసరాలలో దాదాపు 85 శాతానికి దిగుమతులపై ఆధారపడి ఉన్న సంగతి తెలిసిందే. ‘‘ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు, కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది.

ధరలు ఇప్పటికే తగ్గినప్పుడు, ఇక పన్ను తగ్గింపు ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరు పెట్రోల్, డీజిల్‌ ధర తగ్గింపు కోసం అడగవచ్చు, కానీ పన్నుల తగ్గింపు గురించి ఇప్పుడు ప్రశ్నించడం సరికాదు’’ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు.  ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఇంధనంపై ఎక్సైజ్‌ సుంకాన్ని చివరిసారిగా మే 2022లో తగ్గించారు. ఈ నిర్ణయం మేరకు పెట్రోల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ లీటర్‌కు రూ.8 తగ్గింది.  డీజిల్‌పై రూ.6 తగ్గించడం జరిగింది.  

రూ.33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్లే లక్ష్యం!
బడ్జెట్‌ సవరిత అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రూ. 33.61 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని శాఖ సీనియర్‌ అధికారి  తెలిపారు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)