Breaking News

బిలియన్‌ డాలర్ల...భావోద్వేగాల బిజినెస్‌

Published on Wed, 02/11/2026 - 02:52

సాక్షి,  బిజినెస్‌ డెస్క్‌: భారత్‌లో ఇప్పుడు కొత్త తరహా డిజిటల్‌ స్నేహితులు అడుగుపెడుతున్నారు. ఏఐ ఆధారిత వర్చువల్‌ పెట్స్‌ (ఏఐ పెట్స్‌) యువతలో  వేగంగా ఆదరణ పొందుతున్నాయి. నగర జీవనంలో పెరుగుతున్న ఒంటరితనం, నిజమైన పెంపుడు జంతువుల బాధ్యతలు తీసుకోలేని పరిస్థితుల్లో ఏఐ పెట్స్‌ ఒక ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. భావోద్వేగంగా స్పందించడం, మాటలతో ఆదుకోవడం వంటి లక్షణాల వల్ల ఇవి యువతను ఆకర్షిస్తున్నాయి. వీటితో యూజర్లు నిజమైన జంతువును పెంచుకుంటున్న అనుభూతి పొందుతారు.

వీటితో కూడా  రోజువారీ రొటీన్‌ను ఫాలో అవచ్చు. ఆహారం పెట్టడం, స్నానం చేయించడం, ఆడించడం, నిద్ర షెడ్యూల్‌ చూసుకోవడం వంటి పనులు చేస్తూ నిజమైన పెంపుడు జంతువును ఆడించినట్లే ఆనందిస్తారు. ఈ పెట్‌ అప్లికేషన్లలో వినియోగదారులు తమ పెంపుడు జంతువుకు దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేయవచ్చు. నెలకు సగటున రూ. 30 నుంచి రూ. 60 వరకు ఖర్చు చేస్తూ, ఆ ఏఐ పెట్‌ను సంరక్షించడం, శిక్షణ ఇవ్వడం, భావోద్వేగంగా స్పందించేలా నేరి్పంచడం చేస్తున్నారు. 

పెరుగుతున్న మార్కెట్‌ 
వర్చువల్‌ పెట్స్‌ మార్కెట్‌ విలువ ప్రస్తుతం సుమారు 150 మిలియన్‌ డాలర్లని అంచనా. వెంచర్‌ క్యాపిటలిస్టులు ఈ రంగం 35–40 శాతం వార్షిక వృద్ధితో బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఊహిస్తూ అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ యాప్‌లు ప్రధానంగా సబ్ర్‌స్కిప్షన్లు,ఇన్‌–యాప్‌ కొనుగోళ్లు, పెట్‌ యాక్సెసరీస్‌ ద్వారా ఆదాయం పొందుతున్నాయి. 

భవిష్యత్తు ఎలా ఉంటుంది? 
వాయిస్‌ ఆధారిత ఇంటరాక్షన్, మల్టీప్లేయర్‌ ఫీచర్లు, వివిధ లొకేషన్లలో పెట్స్‌ను కలుసుకునే అవకాశాలతో ఈ రంగం మరింత విస్తరిస్తోంది. అయితే ఏఐ పెట్స్‌ టెక్నాలజీ నిజమైన మానవ సంబంధాల నుంచి మనుషులను దూరం చేస్తుందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

టమాగోచ్చి నుంచి ఏఐ వరకు
వాస్తవానికి డిజిటల్‌ పెట్స్‌ కాన్సెప్ట్‌ కొత్తది కాదు. జపాన్‌లో 1990లలో వచి్చన టమాగోచ్చి వీడియో గేమ్‌ వర్చువల్‌ పెట్స్‌కు బాట వేసింది. ఆ తర్వాత 2000లలో టాకింగ్‌ టామ్, ఫ్రెండ్స్‌ యాప్స్, విడ్జెట్స్‌ వంటి అప్లికేషన్లు పాపులర్‌ అయ్యాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఈ వర్చువల్‌ పెట్స్‌ మరింత అడ్వాన్స్‌డ్‌గా మారాయి. పాకెట్‌ పెట్, క్రిప్టో కిట్టీస్, జూమీ వంటి యాప్‌లు యూజర్లు తమ ఊహలకు అనుగుణంగా పెంపుడు జంతువులను సృష్టించుకునే 
అవకాశం ఇస్తున్నాయి. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)