సరికొత్తగా పేటీఎం యాప్‌

Published on Tue, 11/11/2025 - 07:44

చెల్లింపు సేవల సంస్థ పేటీఎం తాజాగా తమ ఫ్లాగ్‌షిప్‌ యాప్‌ సరికొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కృత్రిమ మేధ(ఏఐ) సహాయంతో యూజర్ల రోజువారీ లావాదేవీలను క్రమబద్ధీకరించే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దేశీ యూజర్లతో పాటు 12 దేశాల్లోని ప్రవాస భారతీయులు కూడా మరింత వేగవంతంగా, స్మార్ట్‌గా చెల్లింపులు జరిపేందుకు తోడ్పడే 15 కొత్త ఫీచర్లు, వినూత్న ఇంటర్‌ఫేస్‌ ఇందులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

తరచుగా జరిపే లావాదేవీలకు పొదుపు కోణాన్ని కూడా జోడించేలా ప్రతి చెల్లింపుపై యూజర్లకు డిజిటల్‌ గోల్డ్‌ రూపంలో రివార్డులిచ్చే విధంగా ‘గోల్డ్‌ కాయిన్స్‌’ ఫీచరును ప్రవేశపెట్టినట్లు వివరించింది. నెలవారీ ఖర్చుల వర్గీకరణ, యూపీఐతో అనుసంధానించిన బహుళ బ్యాంకు ఖాతాల్లో నిల్వలను ఒకే చోట చూపించడం, ‘హైడ్‌ పేమెంట్‌’ ఆప్షన్, వాట్సాప్‌ మెసేజీలు.. కాంటాక్టుల నుంచి బ్యాంక్‌..ఐఎఫ్‌ఎస్‌సీ వివరాలను ఆటోమేటిక్‌గా పూరించే మేజిక్‌ పేస్ట్‌ టూల్, అంతర్గతంగా కాల్‌క్యులేటర్‌ మొదలైన కొత్త ఫీచర్లను యాప్‌లో పొందుపర్చినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు.

ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..

Videos

మహిళపై టీచర్ అత్యాచార యత్నం

తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం

విలన్ గా ఉపేంద్ర... సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాక్..!

YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం

Anantha Venkatarami: ప్రైవేటీకరణ ఆపేవరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం

YSRCP Leaders: బాబు అరాచక పాలన ఎలా ఉందంటే.... ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో..

అప్పుడు పుల్వామా.. ఇప్పుడు రెడ్ ఫోర్ట్.. సేమ్ సీన్ రిపీట్

మహిళతో టీడీపీ నేత బూతుపురాణం.. ఆడియో లీక్ వైరల్..

డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ నేత

మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు

Photos

+5

'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)