Breaking News

పాపం పేటీఎం ఇన్వెస్టర్లు.. రూ. 27,000 కోట్లు ఆవిరి!

Published on Thu, 02/15/2024 - 14:50

పేటీఎం ( Paytm )యాజమాన్య ఫిన్‌టెక్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు గురువారం (ఫిబ్రవరి 15) 5 శాతం పడిపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రూ. 325.30 వద్ద సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ని ఉపయోగించే సంస్థలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ను ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి పేటీఎం బ్యాంక్‌ ప్రతినిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ప్రశ్నించిన ఘటన తర్వాత వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు పడిపోయాయి.ఎకనామిక్స్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధం విధించినప్పటి నుంచి 11 రోజులలో పేటీఎం ఇన్వెస్టర్లు సుమారు రూ. 27,000 కోట్లు నష్టపోయారు. ఇది దాని విలువలో 57 శాతం.

ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలతో వ్యాపారాన్ని నిర్వహించిన కస్టమర్‌లకు సంబంధించిన సమాచారం, పత్రాలు, వివరాల ఈడీ నుంచి నోటీసులు, అభ్యర్థనలు వస్తున్నట్లు ఇటీవలి ఫైలింగ్‌లో వన్‌97 కమ్యూనికేషన్స్ అంగీకరించింది. అయితే తమ అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ విదేశీ రెమిటెన్స్‌లలో పాల్గొనదని కంపెనీ స్పష్టం చేసింది.

నివేదికల ప్రకారం.. ఈడీ అధికారులు కోరిన సమాచారం, పత్రాలను పేటీఎం ఇప్పటికే అందించినట్లు తెలుస్తోంది. వచ్చే వారంలోగా మరిన్ని వివరాలు అందజేయాలని ఈడీ ఆదేశించినట్లుగా సమాచారం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి సేకరించిన సమాచారం, డాక్యుమెంట్‌లు ఈ దశలో ఫెమా ఉల్లంఘనలను సూచించడం లేదని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ద్వారా తెలుస్తోంది.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)