ఎన్‌పీసీఐ ప్రకటన.. పేటీఎం షేర్లు ఢమాల్‌!

Published on Wed, 01/01/2025 - 16:07

యూపీఐ ప్రొవైడర్లకు సంబంధించిన 30 శాతం మార్కెట్ షేర్ పరిమితిని పాటించేందుకు గడువును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో రెండేళ్లు పొడిగించింది. ఈ ప్రకటన తర్వాత బుధవారం (జనవరి 1) ట్రేడింగ్ సెషన్‌లో పేటీఎం (Paytm) షేర్లు బీఎస్‌ఈ (BSE)లో దాదాపు 4 శాతం పడిపోయి రూ. 976.5కి చేరుకున్నాయి.

యూపీఐ ప్రొవైడర్ల డిజిటల్‌ లావాదేవీల పరిమాణం వాటి మార్కెట్‌ షేర్‌లో 30 శాతానికి మించకూడదని ఎన్‌పీసీఐ నిబంధన విధించింది. దీనికి ఇదివరకు 2024 డిసెంబర్ 31 వరకు గడువు ఉండగా దీన్ని 2026 డిసెంబర్ 31 వరకు  మరో రెండేళ్లు పొడిగించింది. "వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (TPAPs) సమ్మతి గడువును మరో రెండేళ్లు పొడిగిస్తున్నాము" అని ఎన్‌పీసీఐ తన ప్రకటనలో తెలిపింది.

పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,626 కోట్లుగా ఉంది. కంపెనీ స్టాక్ 52 వారాల కనిష్ట విలువ రూ.310 కాగా, 52 వారాల గరిష్టం రూ.1,063. జనవరి 1న బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఇది ఒకటి.

కాగా ఎన్‌పీసీఐ నిర్ణయం వల్ల వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే (PhonePe), గూగుల్‌ పే (Google Pay)కి స్వల్పకాలిక ఉపశమనం లభించనుంది. రెండూ కలిసి యూపీఐ (UPI) చెల్లింపుల మార్కెట్‌లో 85 శాతానికి పైగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కొత్త పరిమితిని పాటించడానికి వాటికి అదనపు సమయం లభించింది.

రెగ్యులేటరీ డేటా ప్రకారం.. 2024 నవంబర్‌లో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే 47.8% వాటాను కలిగి ఉండగా గూగుల్‌ పే 37 శాతం వాటాను కలిగి ఉంది. రెండు కంపెనీలు కలిసి ఆ నెలలో 13.1 బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశాయి.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)